రాష్ట్రీయం

అంబేద్కర్ వర్శిటీ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 28: రెండు రాష్ట్రాల్లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ నిర్వహించే యుజి సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలును శుక్రవారం నాడు ప్రకటించింది. ఈ పరీక్షలు నవంబర్ 28 నుండి డిసెంబర్ 16 వరకూ జరుగుతాయి. తృతీయ సంవత్సరం పరీక్షలు నవంబర్ 28 నుండి డిసెంబర్ 3 వరకూ, సెకండియర్ పరీక్షలు డిసెంబర్ 5 నుండి 10వ తేదీ వరకూ, ఫస్టియర్ పరీక్షలు డిసెంబర్ 13 నుండి 16 వరకూ జరుగుతాయని యూనివర్శిటీ అధికారులు తెలిపారు. పరీక్షలు మధ్యాహ్నం 2 నుండి 5 గంటల వరకూ జరుగుతాయని చెప్పారు. విద్యార్థులు ‘బిఆర్‌ఎఒయుఆన్‌లైన్ డాట్ ఇన్’ అనే వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, హాల్‌టిక్కెట్లను పరీక్షలకు మూడురోజుల ముందు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.

22, 23 తేదీల్లో సైబర్
భద్రతపై జాతీయ సదస్సు

హైదరాబాద్, అక్టోబర్ 28: సైబర్ భద్రతపై వచ్చే నెల 22, 23 తేదీల్లో జాతీయ సదస్సును నిర్వహిస్తున్నుట్ల సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రకటించింది. హెచ్‌ఐసిసిలో జరిగే ఈ సదస్సును ఐటి శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రారంభిస్తారు. తెలంగాణ ప్రభుత్వ ఐటి మంత్రిత్వ శాఖ సహకారంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. ఐటి పరిశ్రమకు చెందిన దిగ్గజాలు, నిపుణులు ఈ సదస్సుకు హాజరవుతారు. లూసిడెస్ సిఇవో సాకేత్ మోదీ, ఐడిఆర్‌బిటి చైర్మన్ డాక్టర్ ఎఎస్.రామశాస్ర్తీ, టెక్ మహీంద్రా సిఇవో సిపి.గుర్నాని, పిరమిడ్ సైబర్ సిఇవో అలోక్ గుప్తా తదితరులు పాల్గొంటారు.