రాష్ట్రీయం

ఓటుకు నోటు కేసులో వాదనలు వినిపిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 28: ఓటుకునోటు కేసు కొత్త మలుపు తిరిగింది. తనపై ఏసిబి కోర్టు తాజా దర్యాప్తునకు ఆదేశిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దాఖలు చేసిన పిటిషన్ కేసులో తన వాదనలు వినిపించేందుకు అనుమతించాలని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ హైకోర్టును కోరారు.
ఈ మేరకు ఉండవల్లి పిటిషన్ దాఖలు చేశారు. ఏసిబి విభాగం ఓటుకు నోటు కేసులో చార్జిషీటును దాఖలు చేసిందని, ఇందులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేరుందని తెలిపారు. 20 సార్లు చంద్రబాబు పేరును ఏసిబి ప్రస్తావించిందన్నారు. ఈ కేసులో చంద్రబాబును సాక్షిగా లేదా నిందితుడిగా ఏసిబి పేర్కొనలేదన్నారు. ఈ కేసులో అనుమానితులపై తాజా దర్యాప్తు జరపాలని ఏసిబి కోర్టు ఆదేశించడంలో ఎటువంటి తప్పు లేదన్నారు. ఈ కేసులో తన వాదనలు వినిపించేందుకు అనుమతి ఇవ్వాలని ఉండవల్లి కోర్టును కోరారు.