రాష్ట్రీయం

అమెరికా కోర్టు ఉత్తర్వులను కొట్టివేసిన హైకోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 28: అమెరికాలో జన్మించిన ఇద్దరు పిల్లలు భారత్‌లో తన తల్లితో కలిసి ఉండేందుకు అనుమతిని ఇస్తూ అమెరికా కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అమెరికాలో స్ధిరపడిన ప్రవాస భారతీయుడు ఈ పిటిషన్‌దాఖలు చేశారు. తన భార్య ఏడు సంవత్సరాల కుమార్తె, రెండు సంవత్సరాల కుమారుడిని తీసకుని 2013 మార్చిలో అమెరికాను వదిలి ఇక్కడకు వచ్చిందని, కుటుంబ తగాదాలతో ఇక్కడికి వచ్చారని పిటిషన్‌లో పేర్కొన్నారు. కోర్టు విడాకులపై తుది డిక్రీ ఇచ్చినా, పిల్లలను తన కస్టడీకి ఇవ్వాలని అమెరికా కుటుంబకోర్టు ఆదేశించినా, తన భార్య మాత్రం తన కస్టడీకి పిల్లలను ఇవ్వడం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రవాస భారతీయుడి భార్య కూడా విడాకులపై ఇక్కడి కోర్టులో పిటిషన్ దాఖలు చేసి తమ మైనర్ పిల్లలను తన సంరక్షణలోనే ఉంచాలని అభ్యర్ధించారు. ఈ కేసులో ప్రవాస భారతీయుడు సుప్రీం కోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు కొట్టివేసి హైదరాబాద్ హైకోర్టును ఆశ్రయించాలని కోరింది.
ఈ కేసును విచారించిన జస్టిస్ పివి సంజయ్ కుమార్,జస్టిస్ ఎం సీతారామమూర్తితో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అమెరికా కోర్టు 2014లో డిక్రీ జారీచేసినా, సివిల్ ప్రొసిజర్ కోడ్ కింద హైదరాబాద్ కోర్టు ద్వారా అమలు చేసేందుకు అవకాశాలను వినియోగించుకోలేదని పేర్కొంది. ఈ కేసులో పిల్లల సంరక్షణ, సంక్షేమంపై ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోవాలో కోర్టు ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుందని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసులో ఇంకా అవసరమైతే విచారణ చేస్తామన్నారు. ఈ కేసులో కోర్టు ప్రవాసభారతీయుడి 11 సంవత్సరాల కుమార్తెతో మాట్లాడింది.
ఆ బాలిక తాను అమెరికా అనుభవాలు బాధగా ఉన్నాయని, భారతదేశంలో హాయిగా ఉన్నానని పేర్కొంది. ఈ కేసులో కుమారుడు కూడా భారత్‌లో ఉండేందుకు సంతోషంగా ఉన్నారని తల్లి తరఫున అమ్మమ్మ, తాతయ్యతో బలమైన బాందవ్యం కూడా ఏర్పడిందన్నారు. ఈ కేసులో తన పిల్లలను చూసేందుకు అవసరమైన చట్టపరమైన హక్కులు కోరే హక్కు తండ్రికి ఉన్నాయని హైకోర్టు పేర్కొంది. తండ్రి ప్రేమను తిరస్కరించే హక్కు ఎవరికీ లేదని కోర్టు పేర్కొంది.