రాష్ట్రీయం

రైతులను సంక్షోభంలో నెట్టకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 28: దేశంలో ఆంధ్ర, తెలంగాణ, కర్నాటక, గుజరాత్ రాష్ట్రాల్లో ఉన్న లక్షలాది మంది పొగాకు రైతుల సంక్షేమాన్ని, జీవనోపాధిని దృష్టిలో పెట్టుకుని నవంబర్ 7 నుంచి 16వ తేదీ వరకు ప్రపంచ ఆరోగ్య సంస్ధ నిర్వహించే సదస్సును బహిష్కరించాలని అఖిల భారత పొగాకు రైతు సంఘాల సమాఖ్య కేంద్రాన్ని డిమాండ్ చేసింది. ఈ సదస్సులో పొగాకు నియంత్రణపై కీలక నిర్ణయాలు తీసుకుంటారన్నారు. దీని వల్ల లక్షలాది మంది పొగాకు రైతుల భవిత అయోమయంలో పడుతుందన్నారు. ఈ సమావేశానికి తమను ఆహ్వానించలేదని, తమ వాణిని వినిపించుకునే అవకాశం ఇవ్వలేదన్నారు. వ్యవసాయ కూలీల బతుకు తెరువు సంక్షోభంలో పడుతుందన్నాని సమాఖ్య ప్రధాన కార్యదర్శి మురళి బాము తెలిపారు. వాస్తవానికి శాస్ర్తియంగా ప్రజా ఆరోగ్యంపై పొగాకు చూపే ప్రభావంపై ఎలాంటి నిరూపణలు చూపకుండానే కఠిన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా రైతులను దెబ్బతీయాలని చూస్తున్నారన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్ధ ధోరణి భారత్ ప్రతిష్టను దెబ్బతీస్తుందన్నారు.