రాష్ట్రీయం

పోస్ట్ఫాసుల ద్వారా పాస్‌పోర్టు సేవలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 28: పాస్‌పోర్టు కార్యాలయాల ద్వారా అందించే సేవల్లో పోస్ట్ఫాసులు భాగస్వామ్యం కానున్నాయి. ఈ అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. దీనివల్ల పాస్‌పోర్టు కార్యాలయాల్లో సిబ్బంది కొరతను అధిగమించవచ్చని భావిస్తోంది. మరోపక్క పోస్ట్ఫాసుల్లో సిబ్బందికి చేతినిండా పనికల్పించినట్టు అవుతుంది. దీనివల్ల ప్రత్యేకించి కార్పొరేట్ సంస్థలకు పాస్‌పోర్టు సేవలు నిర్వహించాల్సిన పని ఉండదు. దేశవ్యాప్తంగా ఉన్న పాస్‌పోర్టు కార్యాలయాల్లో ఉద్యోగులు, సిబ్బంది వచ్చే ఏడాది నుంచి ఆ తరువాతి రెండేళ్ళ కాలంలో నాలుగు వేల మందికి పైగానే పదవీవిరమణ చేయనున్నారు.
దీనివల్ల ఉన్న కొద్దిమందిపైనే పనిభారం పడనుంది. పదవీ విరమణ ద్వారా ఏర్పడిన వేలాది పోస్టుల ఖాళీలను భర్తీ చేయడం ఇప్పట్లో అయ్యేదికాదు. అలా అని పాస్‌పోర్టు జారీలో జాప్యం జరగడానికి వీల్లేదు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న దగ్గరనుంచి అన్ని పత్రాలు సక్రమంగా ఉంటే పోలీసుల విచారణ తదుపరి రెండు రోజుల వ్యవధిలో పాస్‌పోర్టును జారీచేసే కార్యక్రమం గత ఏడాది కాలంగా అమలవుతోంది. అందువల్ల ఇదే విధానం కొనసాగాలంటే సిబ్బంది కొరతను అధిగమించేందుకు పోస్ట్ఫాసుల సహకారంతో కొన్ని సేవలు అందించాలని కేంద్రం ఆలోచన చేస్తుంది. ఈ విధంగా పోస్ట్ఫాసులు, పాస్‌పోర్టు ప్రాంతీయ కార్యాలయాలు సంయుక్త ఆధ్వర్యంలో సేవలందించగలిగితే భవిష్యత్‌లో కార్పొరేట్ సంస్థల ద్వారా పాస్‌పోర్టు సేవా కేంద్రాలు (పిఎస్‌కె)లు నిర్వహించాల్సిన పని ఉండదు. అపుడు ఎటువంటి ఆరోపణలు, ఫిర్యాదులకు అవకాశం ఉండదు. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో విశాఖ నగరంలో పాస్‌పోర్టు ప్రాంతీయ కార్యాలయం ఉండగా, దీని పరిధిలో పాస్‌పోర్టు సేవా కేంద్రం (పిఎస్‌కె), భీమవరం, విజయవాడల్లో ఒక్కో పిఎస్‌కెలు ఉన్నాయి. తెలంగాణా రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్‌లో పాస్‌పోర్టు ప్రధాన కార్యాలయం ఉంది. ఇది కాకుండా రాష్ట్ర విభజన తదుపరి విజయవాడలో పాస్‌పోర్టు కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇది త్వరలో అందుబాటులోకి రానుంది.
విజయవాడలో ఏర్పాటయ్యే పాస్‌పోర్టు కార్యాలయం పరిధిలోకి ఎనిమిది జిల్లాలు, విశాఖలో ఉన్న ప్రాంతీయ కార్యాలయం పరిధిలో ఐదు జిల్లాలు వస్తాయి. దీనివల్ల పాస్‌పోర్టు సేవలు మరింత సులభతరం కానున్నాయి. ఈ విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పాస్‌పోర్టు కార్యాలయాలు, పిఎస్‌కెల్లో కలిపి ఆయా కేటగిరీలకు సంబంధించి దాదాపు 600 మంది వరకు పనిచేస్తున్నారు. ఇదిలా ఉండగా పదవీ విరమణ చేయగా ఏర్పడిన ఖాళీలను కింది స్థాయి సిబ్బందికి పదోన్నతులు కల్పించడం ద్వారా భర్తీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. 50 శాతం మేర ఖాళీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులను డిప్యూటేషన్‌పై తీసుకోవడం ద్వారా భర్తీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.
పోస్ట్ఫాసుల భాగస్వామ్యం ద్వారాను, ఆయా కేటగిరీల ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడం ద్వారాను, డిప్యుటేషన్ల ద్వారా సిబ్బంది కొరతను అధిగమించేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది. ఈ విధంగా చేయడం వలన రానున్న రోజుల్లో కార్పొరేట్ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న పాస్‌పోర్టు సేవా కేంద్రాల నిర్వహణకు స్వస్తిచెప్పవచ్చని కేంద్రం భావిస్తోంది.