రాష్ట్రీయం

అనువాదాలు మానవాళిని చేరువ చేస్తాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 28: అనువాదాలు మానవాళిని దగ్గర చేస్తాయని రష్యా రాజధాని మాస్కోలో జరిగిన హిందీ సమ్మేళనంలో కేంద్ర హిందీ సమితి సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పేర్కొన్నారు. దేశాల అగ్రనాయకుల చర్చలలో దుబాసీల ప్రాముఖ్యత ఉన్నట్టే, సాహిత్య అనువాదాల వల్ల జాతులు, దేశాలు, వాటి సంస్కృతుల మధ్య పరస్పరం అవగాహన పెరగడానికి తద్వారా ప్రపంచ మానవాళి దగ్గర కావడానికి అవకాశం ఏర్పడుతందని ఆయన పేర్కొన్నారు. మాస్కోలో భారత దౌత్య కార్యాలయం, మాస్కో రాజకీయ విశ్వవిద్యాలయం, ఆఫ్రికన్- ఏషియన్ అధ్యయన సంస్థ కలిపి ఏర్పాటు చేసిన రెండు రోజుల అంతర్జాతీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. మాస్కో, సెయింటర్ పీటర్స్ బర్గ్‌తష్కెంట్ నగరాలతో పాటు బల్గేరియా, ఉజ్బెకిస్థాన్, కజికిస్థాన్, బెలారస్, అజర్‌బైజాన్‌దేశాలనుండి 150 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్న ఈ సదస్సులో ‘ఆధునిక కాలంలో హిందీ వికాసం దాని భవిష్యత్’పై చర్చలు జరగాయి. అన్య భారతీయ భాషలతో పాటు ప్రచలితమైన ప్రపంచ భాషల నుండి కూడా అవసరమైన కొత్త శబ్దాలతో హిందీ భాషను పరిపుష్టం చేసుకోవాలని యార్లగడ్డ చెప్పారు. ఐక్యరాజ్యసమితిలో హిందీని అధికార భాషల్లో ఒకటిగా చేయడానికి తోడ్పడాల్సిందిగా యార్లగడ్డ వివిధ దేశాల ప్రతినిధులను కోరారు. ఈ సందర్భంగా యార్లగడ్డను ప్రశంసాపత్రంతో మాస్కో విశ్వవిద్యాలయ అధికారి డాల్యుద్మిలా ఖోఖలోవా సత్కరించారు.

చిత్రం... మాస్కోలో జరిగిన రెండు రోజుల అంతర్జాతీయ సమ్మేళనంలో భాగంగా యార్లగడ్డను సత్కరిస్తున్న మాస్కో విశ్వవిద్యాలయ అధికారి డాల్యుద్మిలా ఖోఖలోవా