ఆంధ్రప్రదేశ్‌

అర్చకుల పేర్లు, ఇనాం భూములను రెవెన్యూ అడంగల్‌లో నమోదు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 28: దేవాదాయ శాఖ ఆలయాల్లో వంశపారంపర్యంగా అర్చక, ఇతర సేవలు అందిస్తున్న వారి పేర్లు, సర్వీసు ఇనాం భూముల వివరాలు 10 బి అడంగల్‌లో నమోదు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఏపి అర్చక సమాఖ్య ప్రధాన కార్యదర్శి అగ్నిహోత్రం ఆత్రేయబాబు, కార్యనిర్వాహక కార్యదర్శి పెద్దింటి రాంబాబు వెల్లడించారు. అర్చక సంక్షేమ నిధి ట్రస్టు చైర్మన్ ఐవైఆర్.కృష్ణారావు, ముఖ్య కార్యదర్శి జెఎస్‌వి.ప్రసాద్, కమిషనర్ వైవి.అనురాధ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఆలయ భూముల పరిరక్షణలో భాగంగా అనుభవదారుల పేర్లు నమోదు చేయడం వల్ల పారదర్శకత పెరుగుతుందని, అందుకే 13 జిల్లాల కలెక్టర్లకు సిసిఎల్‌ఏ చీఫ్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారని, దేవాదాయ శాఖ సంబంధిత సహాయ కమిషనర్లకు వెంటనే అననుభవదారుల భూముల వివరాలను అందించాల్సిందిగా ఈ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారని తెలిపారు. డిజిటలైజేషన్ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడంతో పాటు ఇనాం భూములకు ప్రభుత్వ రాయితీలు ఇవ్వాలని నిర్ణయాన్ని ఏపి అర్చక సమాఖ్య స్వాగతించింది. అర్చకుల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపడుతున్న చర్యల పట్ల సమాఖ్య నాయకులు హర్షాన్ని వ్యక్తం చేశారు.
మా ఫోన్లను
ట్యాప్ చేస్తున్నారు..
చంద్రబాబు సర్కారు నిర్వాకాన్ని ఆధారాలతో సహా నిరూపిస్తాం
పార్లమెంట్‌లోనూ ప్రస్తావిస్తాం * వైకాపా నేత భూమన స్పష్టీకరణ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, అక్టోబర్ 28: చంద్రబాబు ప్రభుత్వం తమ ఫోన్లను ట్యాపింగ్ చేస్తోందని, దీనికి సంబంధించి తమ వద్ద కచ్చితమైన ఆధారాలు ఉన్నాయని వైకాపా ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో వైకాపా ఎంపీలు ఈ అంశాన్ని ప్రస్తావిస్తారని చెప్పారు. శుక్రవారం ఆయన ఇక్కడ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు పేరుకు మాత్రమే అభివృద్ధి మంత్రాన్ని జపిస్తున్నారని, ప్రజా సంఘాలను, ప్రతిపక్షాలను లోబరుచుకునేందుకు టిడిపి సర్కారు కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం కేంద్ర హోంశాఖ అనుమతితో కేవలం దేశ ద్రోహుల ఫోన్లను మాత్రమే ట్యాప్‌స్తారని, అయితే చంద్రబాబు అవేమీ పట్టించుకోకుండా తనను వ్యతిరేకించే ప్రతి ఒక్కరి మీద నిఘా పెడుతున్నారని, ఫోన్లను ట్యాప్ చేస్తూ అధికారుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు చట్టాన్ని ఉల్లంఘించి టెక్నాలజీని వాడుకుంటూ ఫోన్ ట్యాపింగ్ అనే ఆయుధాన్ని ప్రయోగిస్తున్నారన్నారు. టెక్నాలజీని తన రాజకీయ అవసరాల కోసం వినియోగించుకుంటూ చంద్రబాబు చేస్తున్న దుర్మార్గాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడుతామని భూమన స్పష్టం చేశారు.