ఆంధ్రప్రదేశ్‌

జోరుగా అక్రమ రవాణా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 28: ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థరూ.3,600 కోట్ల నష్టాల నుంచి బయటకు తీసుకురావాలంటే అక్రమ రవాణాపై వేటు వేయాలని ఏపిఎస్ ఆర్టీసీ ఎంప్లారుూస్ యూనియన్ రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. రాష్ట్రంలో పర్మిట్లు లేకుండా 2500 ప్రైవేట్ బస్సులను తిప్పుతున్నారని యూనియన్ నరేతలు సిహెచ్.చంద్రశేఖర్ రెడ్డి, కె.పద్మాకర్, పలిశెట్టి దామోదరరావు తెలిపారు. వీటిని అరికట్టే విషయంలో ప్రభుత్వం అధికారులకు స్వేచ్చ ఇవ్వడం లేదని, దీని వల్ల ఆర్టీసీకి సాలీనా రూ.2000 కోట్ల నష్టం వస్తోందన్నారు. ఆర్టీసీ నష్టాల్లో ఉందన్న సాకుతో ‘పల్లె వెలుగు’ బస్సులను అంచెలంచెలుగా కుదిస్తున్నారని, దీని వల్ల భవిష్యత్తులో గ్రామీణ ప్రజలకు ఆర్టీసీ దూరమవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బస్సులను, సిబ్బందిని తగ్గించడం మానుకుని, ఉద్యోగులతో పాటు రిటైరైన కార్మికులకు బకాయిలను చెల్లించాలని, తొలగించిన కాంట్రాక్టు కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నష్టాలకు కార్మికులే కారణమనే ప్రకటనలను, ప్రచారాన్ని కట్టిపెట్టి ఆర్టీసీని ఆదుకునేందుకు ప్రభుత్వం ప్యాకేజీని ప్రకటించాలన్నారు. క్రమంగా ఆర్టీసీని నష్టాల్లోకి నెట్టేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ఎంప్లారుూస్ యూనియన్ తిప్పికొడుతుందని వారు స్పష్టం చేశారు.