రాష్ట్రీయం

అంతా మన మంచికే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 29: కృష్ణా జలాల కేటాయింపు వివాదం తెలుగు రాష్ట్రాలకే పరిమితమంటూ బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లే విషయమై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలపై ప్రతికూల ప్రభావం లేదనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు సమాచారం. ట్రిబ్యునల్ తీర్పు వల్ల తెలంగాణకే ఎక్కువ నష్టమని, సుప్రీంకోర్టుకు వెళ్లడం వల్ల మనకు వచ్చే లాభం మాట అటుంచి నష్టం జరిగే ప్రమాదం ఉందని ముఖ్యమంత్రికి న్యాయ, సాగునీటి రంగాల నిపుణులు సూచించినట్లు తెలిసింది. ఈ విషయమై తుది నిర్ణయం తీసుకోలేకపోయినా వేచి చూసే ధోరణి మంచిదని ఏపి సర్కార్ భావిస్తున్నట్టు తెలిసింది.
బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌పై తమ అభిప్రాయాలను రెండు రాష్ట్రాలూ డిసెంబర్ 14లోగా నివేదించాల్సి ఉంది. ఈ వాదనలపై ట్రిబ్యునల్ విచారణ జరిపి కృష్ణా జలాల కేటాయింపులు చేస్తుంది. తెలంగాణలో కృష్ణా పరీవాహక ప్రాంతం 68 శాతం ఉన్నా, నీటి కేటాయింపుల్లో మాత్రం తమకు సమన్యాయం జరగలేదని ఆ రాష్ట్రం భావిస్తోంది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి, నెట్టెంపాడు తదితర పథకాలను నిర్మిస్తోంది. వీటికి నీటి కేటాయింపులు లేవు. అదనంగా కేటాయించిన 254 టిఎంసిలపైనే ఆధారపడాల్సి ఉంది. సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే ట్రిబ్యునల్ ఆర్డర్‌ను రద్దు చేసినా, చేయకపోయినా తెలంగాణ ప్రభుత్వం పట్టిసీమ ఎత్తిపోతల పథకం, పోలవరం ప్రాజెక్టులను చూపించి, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో ఎక్కువ వాటాను అడిగేందుకు ఆస్కారం ఇచ్చినట్లుగా ఉంటుందని ఏపి సాగునీటి నిపుణులు భావిస్తున్నారు. అందుకే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసే బదులు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ వద్ద వాదనలు వినిపించడం వరకే పరిమితం కావాలని ఏపి ఇరిగేషన్ ఇంజనీర్లు ప్రభుత్వానికి సలహా ఇచ్చినట్టు తెలిసింది.