రాష్ట్రీయం

బలిమెలకు బలగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, అక్టోబర్ 29: ఏఓబిని భద్రతా బలగాలు దిగ్బంధం చేశాయి. ఆంధ్రా, ఒడిశా ప్రభుత్వాలు బలిమెలకు భారీగా బలగాలను తరలించాయి. కోలుకోలేని దెబ్బతిన్న మావోయిస్టులు ప్రతీకారేచ్ఛతో ఎదురుదాడులు చేసే అవకాశం ఉన్నందున వాటిని ఎదుర్కొనేందుకు మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. దండకారణ్యం, ఏఓబిలోని ఆంధ్రా, తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌గఢ్‌తో పాటుగా మహారాష్ట్ర సరిహద్దుల్లో భారీగా నిఘా ఏర్పాటు చేశారు. ఏఓబి ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ప్రతాప్ ఆంధ్రా, ఒడిశా, చత్తీస్‌గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల బంద్‌కు పిలుపునిచ్చారు. ఏ క్షణాన్నైనా మావోయిస్టులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని కేంద్ర హోంశాఖ సైతం మావోయిస్టు ప్రాబల్య రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. నిఘా వర్గాల హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.
ఎందుకింత హడావుడి?
ఏఓబిలో ఒక రకంగా యుద్ధమే జరుగుతోంది. ఎందుకంటే గతంలో మావోయిస్టుల అనే్వషణలో కూంబింగ్‌కు వెళ్లిన గ్రేహౌండ్స్ బలగాలు ఎన్‌కౌంటర్ జరిగిన వెంటనే ఆ ప్రాంతం నుంచి బయటకు వచ్చేసేవి. రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసు పార్టీలను యుద్ధప్రాతిపదికన హెలికాప్టర్ల ద్వారా బలగాలను అడవి నుంచి రప్పించేవి. కానీ ఈసారి ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న తీరు అనుమానాలకు తావిస్తోంది. ఇటీవల ఏఓబిలో జరిగిన ఎన్‌కౌంటర్ ప్రదేశం బలిమెల రిజర్వాయర్ సమీపంలోనే 10 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే ఒక ద్వీపం. ఇక్కడ ఎన్‌కౌంటర్ జరిగిన సమయంలో మావోయిస్టులు వారి నుంచి తప్పించుకుని పోవడం అనేది సాధ్యమయ్యే పనికాదు. వయసు పైబడిన ఆర్‌కె లాంటి అగ్రనేత ఆ పద్మవ్యూహం నుంచి తప్పించుకోవడం కుదరని పని. ఒక వైపు మావోయిస్టు పార్టీ ఆర్‌కె రాలేదని చెబుతోంది. అంటే గాయపడి ఆ ద్వీపంలోనే ఉండి ఉండాలి. లేనిపక్షంలో ఎన్‌కౌంటర్‌లో చనిపోయి ఉండాలి. ఆర్‌కె లాంటి అగ్రనేత చనిపోయాడంటే సంభవించే పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఒక వేళ ప్రభుత్వం, భద్రతా బలగాలు గోప్యంగా ఉంచుతున్నాయా? అనే అనుమానం రాక మానదు. మున్నాతో పాటే ఆర్‌కె ఉన్నాడని మావోయిస్టు పార్టీ కూడా చెబుతోంది. మల్కన్‌గిరి కమిటీ కార్యదర్శి ఆర్‌కె చనిపోయాడని ఒక ప్రకటనలో పేర్కొనడం, మరో వైపు బలిమెలకు భద్రతా బలగాలు తరలి వెళ్లడం ఆ ప్రకటనకు బలం చేకూర్చుతోంది. ఆర్‌కె చనిపోతే మావోయిస్టు పార్టీ స్పందన తీరును ముందుగానే విశే్లషించుకుని భద్రతా బలగాలను బలిమెలకు తరలిస్తున్నారని తెలుస్తోంది. బలిమెల రిజర్వాయర్ ద్వారా అటవీప్రాంతాన్ని పరిశీలించేందుకు గోవా నుంచి బుల్లెట్ ప్రూఫ్ బోట్‌ను రప్పించినట్లుగా తెలుస్తోంది. 2008 జూన్ 30న గ్రేహౌండ్స్ బలగాలు ప్రయాణిస్తున్న లాంచీపై మావోయిస్టులు కాల్పులు జరిపి 37 మందిని హతమార్చారు. అందుకే ఈసారి బుల్లెట్ ప్రూఫ్ బోట్ ద్వారా ఏఓబిని తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాలు సన్నాహాలు చేస్తున్నాయి. గగనతలం నుంచి హెలీకాప్టర్, బలిమెల రిజర్వాయర్‌లో బుల్లెట్‌ప్రూఫ్ బోటులో బలగాలు ఇటీవల ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఉన్న బలగాలకు రక్షణగా పహరా కాస్తున్నాయి.

చిత్రం.. బిలిమెలకు చేరిన బలగాలు