రాష్ట్రీయం

ఆంధ్రలో ఆలయాలకు కొత్తశోభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 29: నవ్యాంధ్రలోని దేవాలయాలకు ప్రత్యేక శోభను సంతరింపజేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలోని 1371 దేవాలయాలకు ఏటా రూ.8కోట్ల మేర సాయం చేసేందుకు సర్కార్ నిర్ణయించింది. ఆన్‌లైన్‌లో ఆలయాలకు చెల్లింపులు చేసేందుకు, దేవాలయాల పరిరక్షణకు చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలోని దేవాలయాలకు జవజీవాలు కల్పించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఎన్నో దేవాలయాల జీర్ణోద్ధరణకు చర్యలు చేపట్టిన ప్రభుత్వం మరిన్ని కార్యక్రమాలను చేపట్టాలని భావిస్తోంది. ధూప, దీప నైవేద్య కార్యక్రమం ద్వారా భక్తుల్లో, అర్చకుల్లో సదభిప్రాయాన్ని కల్గించేందుకు ఇప్పటికే శ్రీకారం చుట్టింది. గ్రామీణ ప్రాంతాల్లోని ధూప, దీప నైవేద్యాలను నిర్వహించలేని, అర్చకులకు వేతనాలు చెల్లించలేని దేవాలయాలకు సాయం చేసేందుకు దేవాదాయ శాఖ చర్యలు తీసుకుంటోంది. వివిధ దేవాలయాలకు సాయం చేయాలని వినతులు అందిన నేపథ్యంలో ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని 1371 దేవాలయాలకు ఒక్కో దేవాలయానికి నెలకు ఐదు వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. ఆర్థిక సాయం అందిస్తుండటంతో చాలా దేవాలయాలు భక్తులతో కళకళలాడుతున్నాయి. ధూప దీప నైవేద్యాల కోసం నెలకు 67 లక్షల రూపాయలు చెల్లిస్తోంది. శ్రీకాకుళంలో 69 దేవాలయాలకు, విజయనగరంలో 60, విశాఖలో 34, తూర్పు గోదావరిలో 71, పశ్చిమ గోదావరిలో 104, కృష్ణాలో 143, గుంటూరులో 97, ప్రకాశంలో 98, నెల్లూరులో 84, కడపలో 185, కర్నూలులో 146, అనంతపురంలో 213, చిత్తూరులో 66 ఆలయాలకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. దీనితో పాటు తమిళనాడులోని ఒక దేవాలయానికి కూడా ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఈ నిధులు పూర్తిగా సద్వినియోగం అయ్యేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఆలయాల స్థితిగతులపై కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. దేవాలయాల్లో పనిచేసే నిరుపేద బ్రాహ్మణుల స్థితిగతులపై అధ్యయనం చేసి, ఆలయ ఆదాయంలో మూడు శాతం మేరకు నిధులను వారి కుటుంబాలకు సాయం అందించేందుకు వీలుగా వ్యవస్థను ఏర్పాటు చేశారు.