రాష్ట్రీయం

కార్మికులకు దీపావళి కానుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 29: కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ దీపావళి పండుగు సందర్భంగా కార్మికులకు కానుక ప్రకటించారు. భవిష్యనిధి (పిఎఫ్)లో వాడుకలో లేకుండా ఉన్న 42 వేల కోట్ల రూపాయలపై 8.8 శాతం వడ్డీని కార్మికులకు చెల్లించేలా నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లు దత్తాత్రేయ శనివారం విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. దీని వలన 9.8 కోట్ల మంది కార్మికులకు లబ్ధి చేకూరుతుందని ఆయన తెలిపారు. కార్మికుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, సుమారు 4 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులతో పాటు హోంగార్డులు, సెక్యూరిటీ గార్డులకు కూడా ఇఎస్‌ఐ సౌకర్యం కల్పించబోతున్నామని ఆయన చెప్పారు. ఆశావర్కర్లు, అంగన్‌వాడీ వర్కర్ల జీవితాల్లో వెలుగులు రావడమే దీపావళి పండుగ అవుతుందని అన్నారు. ప్రభుత్వాల పని తీరుపై సర్వేలను స్వాగతిస్తున్నామని దత్తాత్రేయ చెప్పారు. అయితే ఇటీవల ముఖ్యమంత్రి కెసిఆర్ చేయించిన సర్వేలో బిజెపికి ఒక్క సీటు వస్తుందని చెప్పడం తమకు మేలు చేస్తుందని, తాము మరింత కష్టపడి పని చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు.