రాష్ట్రీయం

టెన్ త పరీక్షల ఫీజు గడువు పొడిగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 29: ఎస్‌ఎస్‌సి రెగ్యులర్/ ప్రైవేట్ అభ్యర్థులు పరీక్షా ఫీజును చెల్లించే గడువును పొడిగించారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ పరీక్షల బోర్డు డైరెక్టర్ పేరుతో ఒక ప్రకటన వెలువడింది. ఆలస్య రుసుము లేకుండా 2016 నవంబర్ 15 వరకు ఫీజు చెల్లించవచ్చని, 50 రూపాయల అపరాధ రుసుముతో నవంబర్ 23 వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. 200 రూపాయల అపరాధ రుసుముతో డిసెంబర్ 1 వరకు, 500 అపరాధ రుసుముతో డిసెంబర్ 9 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని డైరెక్టర్ వివరించారు. వివరాల కోసం ప్రధానోపాధ్యాయులను సంప్రదించాలని డైరెక్టర్ సూచించారు.