రాష్ట్రీయం

గవర్నర్, కెసిఆర్, బాబు దీపావళి శుభాకాంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 29: దీపావళి సందర్భంగా తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మంత్రులు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చీకట్లను పారద్రోలి వెలుగులు నింపే దీపావళి తెలంగాణ ప్రజల జీవితాల్లో కూడా వెలుగులు నింపుతుందని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలంతా సంతోషంగా పండుగ చేసుకోవాలని, వెలుగు జిలుగుల తెలంగాణను దీవించాలని భగవంతుడిని కోరుకుంటున్నట్టు కెసిఆర్ చెప్పారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే పండుగ దీపావళి అని గవర్నర్ అన్నారు. మంత్రులు ఈటల రాజేందర్, కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డి, జగదీష్‌రెడ్డి ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
సంక్షేమ కాంతులు వెదజల్లాలి: చంద్రబాబు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, దేశ ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. నరకాసుర సంహారంతో దుష్టశిక్షణ, శిష్టరక్షణ, ధర్మ సంరక్షణ జరిగిన ఈ దీపావళి పండుగ, సత్యభామ ద్వారా మహిళా శక్తికి ప్రతీకగా నిలవడం గర్వకారణమన్నారు. ఆడబిడ్డలకు ఆస్తి హక్కు, విద్యా, ఉద్యోగ, రాజకీయ అవకాశాలలో సముచిత భాగస్వామ్యం అందించిందని, మహిళా లోకానికి ప్రీతిపాత్రమైన పసువు రంగు జెండాతో మహిళాసాధికారతకు అండదండలు టిడిపి అందిస్తోందని గుర్తు చేశారు. దీపావళి పండుగ ప్రతి తెలుగింటిలో అభివృద్ధి, సంక్షేమ కాంతులను వెలిగించాలని, తెలుగు ప్రజ ప్రపంచంలోనే తిరుగులేని శక్తిగా మరోసారి అవతరించేందుకు ఎదురైన శుభ సంకేతమే ఈ దీపావళి పండుగని సిఎం అభివర్ణించారు.
కోడెల, జగన్ శుభాకాంక్షలు
ఏపి అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు, వైకాపా అధినేత, ప్రతిపక్ష నాయకుడు జగన్, శాసన మండలి చైర్మన్ చక్రపాణి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు, ఎమ్మెల్యే బాలకృష్ణ, పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె.హరిబాబు తదితరులు కూడా దీపావళి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.