రాష్ట్రీయం

న్యాయ వ్యవస్థను నమ్మరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 29: సుప్రీం కోర్టు, హైకోర్టుతో పాటు దేశంలోని అన్ని న్యాయ స్థానాల్లో ఖాళీగా ఉన్న జడ్జిల పోస్టులను వెంటనే భర్తీ చేయని పక్షంలో ప్రజలకు న్యాయ వ్యవస్థంటే నమ్మకం సడలుతుందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎన్ సంతోష్ హెగ్డే అన్నారు. శనివారం ఆయన ఇక్కడ విలేఖర్లతో ముచ్చటిస్తూ, న్యాయ వ్యవస్థను పటిష్ఠం చేయని పక్షంలో వివాదాలను సెటిల్‌మెంట్ చేసే గ్రూపులు పుట్టుకొస్తాయని, ఇది దేశానికి ప్రమాదకరమన్నారు. హైకోర్టుల్లో 50 శాతం జడ్జిపోస్టులు ఖాళీగా ఉన్నందు వల్ల కేసుల పెండింగ్ పెరిగిపోతోందని, ఒక్కో కేసు పరిష్కారానికి 15 సంవత్సరాల సమయం పడుతోందన్నారు. ఒక సారి న్యాయ వ్యవస్థపట్ల నమ్మకం సడలితే సమాజంలో అన్ని రకాల అజ్ఞాత శక్తులు, గ్యాంగులు ఏర్పడుతాయన్నారు. గూండాలు, రౌడీలు రుణాల రికవరీకి పాల్పడుతారన్నారు. కొలీజియంను కేంద్రం విస్మరించరాదన్నారు. ఈ వ్యవస్థ సిఫార్సులను కేంద్రం అమలు చేయడం మంచిదన్నారు. హైకోర్టు జడ్జిల మంజూరైన పోస్టులను 906 నుంచి 1079కి పెంచారని, ఇది మంచి పరిణామమన్నారు. వెంటనే ఈ పోస్టుల భర్తీకి కేంద్రం చర్యలు తీసుకోవాలన్నారు. ఒక వేళ కొలీజియం సిఫార్సులు నచ్చకపోతే, మళ్లీ మంచి అభిప్రాయాలను పంపి వాటిని ఆమోదింపచేసుకోవచ్చన్నారు. అంతేకాని పెండింగ్‌లో పెట్టడం మంచిదికాదన్నారు. కొలీజియం నిర్ణయాలే శిరోధార్యమని, ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలన్నారు. అలహాబాద్ హైకోర్టులో 60 శాతం, కర్నాటక హైకోర్టులో 50 శాతం జడ్జిల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. దేశంలో ఏ హైకోర్టుకు కూడా పూర్తి స్థాయిలో జడ్జిలు లేరని హెగ్డే అన్నారు.