రాష్ట్రీయం

హైదరాబాద్ నివాస గృహాల రియల్టీలో జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 29: హైదరాబాద్‌లో నివాస గృహాల రియల్టీ రంగం జోరందుకుంది. ఈ ఏడాది తొలి త్రైమాసికంతో పోల్చితే, రెండవ త్రైమాసికంలో అపార్టుమెంట్ల విలువ పెరిగింది.
ఈ వివరాలను ‘99 ఎకరాస్. కామ్’ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నరసింహ జయకుమార్ చెప్పారు. అపార్టుమెంట్లకు సంబంధించి నాగోలులో చదరపు అడుగు విలువ ఏప్రిల్‌లో రూ.2850 ఉంటే, సెప్టెంబర్‌కు రూ.3వేలకు, అలకాపురిలో రూ.2600 నుంచి రూ.2700కు, బేగంపేటలో రూ.4375 నుచి 4517కు, మాదాపూర్‌లో రూ.4950 నుంచి 5100కు, నార్సింగిలో రూ. 3600 నుంచి రూ.3700కు పెరిగింది. ప్లాట్ల విలువలో రేటు నాలుగు శాతం పెరిగింది. ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఎక్స్‌ప్రెస్ హైవే, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి విస్తరించిన రోడ్లు పరిసరాల్లో ఇళ్ల నిర్మాణం ఊపందుకుంది.
బాలాపూర్, వరంగల్ జాతీయ రహదారి, శంషాబాద్, మొయినాబాద్‌లో ఐదు నుంచి 9 శాతం వృద్ధిరేటు నమోదైంది. మాదాపూర్, కొండాపూర్, నిజాంపేట, చందానగర్, మణికొండ, మదీనాగూడలో ఇళ్ల అద్దెలు 11 నుంచి 22 శాతం పెరిగాయి.