రాష్ట్రీయం

ఆర్కే ఎక్కడ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 31: ‘సామాన్యుడైనా, మావోయిస్టు అయినా ప్రాణాలు విలువైనవి, ప్రజలను, వారి ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది’ అని రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. ఆంధ్ర- ఒడిశా సరిహద్దులో ఇటీవల జరిగిన భారీ ఎన్‌కౌంటర్ తర్వాత మావోయిస్టు అగ్రనేత, సిపిఐ మావోయిస్టు గ్రూప్ సెంట్రల్ కమిటీ సభ్యుడు జి రామకృష్ణ (ఆర్కే) కనిపించకపోవడంపై సోమవారం హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. రామకృష్ణ భార్య శిరీష లంచ్‌మోషన్ పిటీషన్ హెబియస్ కార్పస్ దాఖలు చేశారు. వ్యాజ్యంపై జస్టిస్ సివి నాగార్జున రెడ్డి , జస్టిస్ ఎంఎస్‌కె జైస్వాల్‌లతో కూడిన బెంచ్ విచారణ జరిపింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆంధ్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆర్కే చనిపోయాడా? లేక పోలీసుల అదుపులోనే ఉన్నాడా? అనేది చెప్పాలని ప్రశ్నించింది. ఏదో జరిగిందని ప్రాథమికంగా అనిపిస్తోందని కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. పోలీసులు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే చేసిన బూటకపు ఎన్‌కౌంటర్‌లో మావోలు చనిపోయారని శిరీష తరఫు న్యాయవాది వి రంగనాథ్ కోర్టు దృష్టికి తెచ్చారు. ఆర్కే కుమారుడు మున్నాను పట్టుకుని తీవ్రంగా హింసించి నకిలీ ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపారని, మృతదేహాన్ని రెండు రాష్ట్రాల సరిహద్దులో పడేశారని వాదించారు. రాష్ట్ర డిజిపి అక్టోబర్ 25, 26 తేదీల్లో విరుద్ధమైన ప్రకటనలు చేశారని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. విశాఖ రూరల్ ఎస్పీ ఆధీనంలో ఆర్కే ఉన్నట్టు ఆయన భార్య విశ్వసిస్తున్నారని న్యాయవాది పేర్కొన్నారు. తను ఇంత వరకూ ఇటువంటి ఎన్‌కౌంటర్‌ను చూడలేదు, వినలేదని ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ నాగార్జున రెడ్డి వ్యాఖ్యానించారు. ఆర్కే పోలీసుల అదుపులో లేరని ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాది రమేష్ కోర్టు దృష్టికి తెచ్చారు. ఆర్కే పోలీసుల అదుపులో లేరని భావిస్తే ఈపాటికే ఆయన తన కుటుంబీకులకు యోగక్షేమాలతో సమాచారం అందించేవారు కదా అని జస్టిస్ నాగార్జున రెడ్డి ప్రశ్నించారు. సెల్ నెట్‌వర్కు లేని ప్రాంతాలకు ఆర్కే పారిపోయి ఉంటారని ప్రభుత్వ న్యాయవాది రమేష్ పేర్కొనగా, మావోయిస్టుల నెట్‌వర్కును తక్కువ అంచనా వేయవద్దని న్యాయమూర్తి అన్నారు. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన న్యాయమూర్తి, ఆర్కేకు పోలీసులు ఎలాంటి హానీ తలపెట్టరని భావిస్తున్నట్టు వ్యాఖ్యానించారు.