రాష్ట్రీయం

ఓటుకు నోటు కేసు మళ్లీ వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 31: ఓటుకు నోటు కేసు విచారణను రాష్ట్ర హైకోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. ఎపి ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ సిద్ధార్థ లూథ్రా హాజరై జస్టిస్ టి సునీల్ చౌదరి ముందు వాదనలు వినిపించారు. వచ్చే సోమవారం నాడు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫున న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తమ వాదనలను వినిపించనున్నారు. ఓటుకు నోటు కేసులో పునర్విచారణ జరపాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఎసిబి కోర్టును ఆశ్రయించారు. దీంతో తనపై విచారణ నిలిపివేయాలంటూ చంద్రబాబునాయుడు హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా, ఎసిబి కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టు ఎనిమిది వారాల పాటు స్టే విధించింది. బాబు స్వర నమూనాలను వివిధ ఫోరెన్సిక్ ల్యాబ్‌లలో పరీక్షలకు పంపించి, ఆ నివేదికల ఆధారంగా ఆర్కే ఎసిబి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
డీసెట్ నోటిఫికేషన్
ఎందుకు ఇవ్వలేదు
డీసెట్ నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదో మూడు రోజుల్లో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కె బాలరాజు తదితరులు దాఖలు చేసిన పిటీషన్‌పై జస్టిస్ చల్లా కోదండరాం విచారణ జరుపుతూ ఈ ఆదేశాలు ఇచ్చారు.