రాష్ట్రీయం

న్యాయ విచారణ జరిపించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 31: మావోయిస్టు అగ్ర నేత రామకృష్ణ అలియాస్ అక్కిరాజు హరగోపాల్ ఆచూకీపై సస్పెన్షన్ ఇంకా వీడలేదు. ఆర్కే ఆచూకీపై ప్రజాసంఘాలు, మానవ హక్కుల సంఘాల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ పొలిటిల్ జేఏసి చైర్మన్ కోదండరాం స్పందించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రా, ఒడిశా బార్డర్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్న మావోయిస్టులను వెంటనే కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేశారు. మావోయిస్టు నేత ఆర్కేతోపాటు మరికొంతమంది పోలీసుల అదుపులోనే ఉన్నారని, వారిని వెంటనే కోర్టులో హాజరుపరచాలన్నారు.ఏవోబీ ఎన్‌కౌంటర్‌పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ప్రొఫెసర్ విశే్వశ్వరరావు, చిక్కుడు ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఏవోబీలో రూ. 140 లక్షల కోట్ల ఖనిజ సంపదపై పాలకవర్గం, బడా పారిశ్రామిక వేత్తలు కనే్నశారని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. మల్కన్‌గిరి పరిసరాల్లోని ఖనిజ సంపదను ఎలాగైనా దక్కించుకోవాలని, అక్కడి ఆదివాసీలకు అండగా ఉన్న మావోయిస్టులను హతమార్చేందుకు కుట్రపన్నారని, ఇందులో భాగంగానే పోలీసులు భారీ ఎన్‌కౌంటర్‌కు తెగబడ్డారని ఆరోపించారు. ఆర్కే సహ మరికొంతమంది ఏపి పోలీసుల అదుపులోనే ఉన్నారన్నారు. ఏవోబి ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎందుకు స్పందించలేదని ప్రొఫెసర్లు ప్రశ్నిస్తున్నారు.
నా భర్త ఆచూకీ చెప్పండి
తన భర్త ఆర్కే ఆచూకీ తెలపాలంటూ ఆయన భార్య శిరీష్ అలియాస్ పద్మక్క సోమవారం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఆర్కే ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారని కొందరు, పోలీసుల అదుపులోనే ఉన్నారని మావోయిస్టులు, మావోయిస్టు పార్టీ సానుభూతిపరులు అంటుండగా, తమ అదుపులో ఆర్కే లేరని పోలీసులు చెబుతున్నారని ఆమె అన్నారు. అయితే ఆర్కే పోలీసుల అదుపులోనే ఉన్నారని, తన భర్తను వెంటనే కోర్టులో హాజరుపరచాలని ఆమె కోరారు.