తెలంగాణ

పవన్ ఇక ‘ఆంధ్రావాలా’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి/ఏలూరు, అక్టోబర్ 31: జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ తన రాజకీయ భవితవ్యాన్ని వ్యూహాత్మకంగా తీర్చిదిద్దుకుంటున్నారు. ఇప్పటివరకూ హైదరాబాద్ కేంద్రంగా రాజకీయ కార్యకలాపాలు కొనసాగిస్తున్న పవన్ ఇకపై ఆంధ్రప్రదేశ్‌కు పూర్తిస్థాయిలో మకాం మార్చనున్నారు. ఈమేరకు ఆయన తన పార్టీ నేతలకు స్పష్టమైన సంకేతాలిచ్చారు. సోమవారం తనను కలసిన జనసేన నేతలు, అభిమానులతో పవన్ ముచ్చటించారు. ఏపిలో రాజకీయ పరిస్థితులు, రాజకీయ పార్టీల కార్యకలాపాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఏలూరులో తనకు అనువైన నివాసం చూడాలని పురమాయించారు. త్వరలో తన ఓటును కూడా అక్కడే నమోదు చేయించుకుంటానని వారికి వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఓటుహక్కు హైదరాబాద్‌లో వున్న విషయం తెలిసిందే.
ఇదిలాఉండగా, ఏలూరుకు మకాం మార్చిన తర్వాత బెజవాడలో పార్టీ కార్యాలయం కూడా ఏర్పాటు చేసుకునేందుకు పవన్ నిర్ణయించినట్లు సమాచారం. ఏపిలో రాజకీయ పార్టీల కార్యకలాపాలు, ప్రభుత్వ నిర్ణయాలు, ప్రతిపక్షాల ఆందోళనలను నిశితంగా గమనిస్తోన్న పవన్.. తాను హైదరాబాద్‌లో ఉండి ఏపి రాజకీయాల గురించి మాట్లాడటం సరైన విధానం, వ్యూహం కాదనే నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఇదే అంశంలో వైసీపీ అధినేత జగన్ తన రాజకీయ ప్రత్యర్థుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు.
ఇటీవలి కాలంలో కాంగ్రెస్ నేతలు కూడా తనను హైదరాబాద్‌లో కూర్చుని, సినిమా షూటింగులు చేసుకుంటూ రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారంటూ చేస్తున్న విమర్శలను పవన్ పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. తన అడుగులు మరీ వేగంగా కాకుండా నెమ్మదిగానయినా నిర్దిష్టంగా, పటిష్ఠంగా ఉండాలన్న వ్యూహంతోనే ఆయన ముందుకెళుతున్నారని చెబుతున్నారు. ఎన్నికలకు ఏడాది ముందువరకూ చేతిలో ఉన్న అన్ని సినిమా ప్రాజెక్టులను పూర్తిచేసుకుని ఏడాదికి ముందు పూర్తిస్థాయి రాజకీయ నేతగా జనం ముందుకు రావాలన్నది పవన్ అసలు వ్యూహమని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
ఆలోగా ప్రాంతాల వారీగా సభలు నిర్వహించడం ద్వారా పార్టీ ఉనికిని చాటాలన్నది ఆయన ఆలోచనగా ఉందంటున్నారు. తనవద్దకు వచ్చే జనసేన నేతలు, అభిమానులను తొందరపడవద్దని, రెండేళ్లలో వ్యాపారాలు చేసుకుని ఆర్థికంగా బలపడాలని సూచిస్తున్నారు. ఏపి ఎన్నికల్లో డబ్బు ప్రధాన పాత్ర పోషిస్తున్న విషయాన్ని గ్రహించినందుకే ఆయన తన అనుచరులకు ఈవిషయం తరచూ స్పష్టం చేస్తున్నారని సన్నిహితులు అంటున్నారు.

ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటరులో
పవన్‌కల్యాణ్ నిర్ణయానికి మద్దతుగా
కేక్ కట్ చేస్తున్న జనసేన పార్టీ నేత సాగర్