రాష్ట్రీయం

మహాస్వామీ.. అలా మాట్లాడకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 1: షిర్డీసాయి భక్తుల మనోభావాలను గాయపరిచేలా ఉత్తరామ్నాయ బదరీజ్యోతిష్పీఠం, పశ్చిమామ్నాయ ద్వారకా శారదాపీఠం అధిపతి జగద్గురు శంకరాచార్య శ్రీ స్వరూపానంద సరస్వతీ మహాస్వామి భవిష్యత్తులో ఎక్కడా మాట్లాడవద్దని హైదరాబాద్‌లోని 20వ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. షిర్డీసాయి దేవుడు కాదని, భూతమని, అందుకే సాయిని పూజించవద్దని సరస్వతీ మహాస్వామి ఇటీవల ఏపీ, తెలంగాణల్లో జరిగిన వేర్వేరు సమావేశాల్లో పిలుపునిచ్చారు. దాంతో షిర్డీసాయి భక్తులు కోర్టుకు వెళ్లారు. హైదరాబాద్‌లోని షిర్డీసాయిబాబా దేవాలయాల తరఫున ప్రతినిధిగా కె. లక్ష్మయ్య, ఎం. సూర్యనారాయణ సంయుక్తంగా ఒక పిటీషన్‌ను నాంపల్లిలోని 20వ ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో మంగళవారం దాఖలు చేశారు. పిటీషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది. భవిష్యత్తులో ఎక్కడా సాయి భక్తుల మనోభావాలను గాయపరిచే విధంగా షిర్డీసాయిబాబా గురించి మాట్లాడవద్దని సరస్వతీ మహాస్వామికి సూచించింది. దీనివల్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని కోర్టు వెల్లడించింది. కేసుపై తదుపరి విచారణను ఈనెల 15కు వాయిదా వేశారు. సరస్వతీ మహాస్వామి స్వయంగా కానీ, అడ్వకేట్ ద్వారా కాని కోర్టుకు హాజరుకావాలని సమన్లు జారీ చేశారు.