ఆంధ్రప్రదేశ్‌

ప్రతిభావంతులకు భారీ స్కాలర్‌షిప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 1: భారతదేశంలో మెడికల్, ఇంజనీరింగ్, ఫౌండేషన్ కోచింగ్ సంస్థల్లో అగ్రగామిగా ఉన్న ఆకాశ్ మరోమారు సీనియర్ , జూనియర్ ఆకాశ్ ప్రతిభానే్వషణ పరీక్షలను నిర్వహిస్తోంది. వైద్య , ఇంజనీరింగ్ వృత్తిలో రాణించదల్చుకున్న వారికి స్కాలర్‌షిప్ అందించేందుకు ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్టు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఆకాశ్ సంస్థ మెరిట్ అభ్యర్థులకు 8.64 కోట్ల రూపాయలను స్కాలర్‌షిప్‌గా అందిస్తున్నట్టు సంస్థ పేర్కొంది. ఈ స్కాలర్‌షిప్ ద్వారా అర్హులైన ప్రతిభావంతులైన వందలాది మంది విద్యార్థులకు ఆర్థిక భారం లేకుండా వారి లక్ష్యాలను చేరుకునేలా తమ సంస్థ అవకాశం కల్పిస్తోందని ఆకాశ్ ప్రతినిధి తెలిపారు. దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల్లోని 720 పట్టణాల్లో ప్రతిభానే్వషణ పరీక్షలు నిర్వహించగా, అందులో ఆంధ్రా, తెలంగాణ నుండి 18,367 మంది ఆన్‌థే ప్రతిభానే్వషణ పరీక్షకు హాజరయ్యారని సంస్థ తెలిపింది.