ఆంధ్రప్రదేశ్‌

ఎమ్మెల్యేను ప్రశ్నించడమే నేరమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉండి, నవంబర్ 1: తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనచైతన్య యాత్రలు పశ్చిమ గోదావరి జిల్లాలో జన నిర్బంధ యాత్రలుగా మారుతున్నాయి. పోలీసుల అతిప్రవర్తన కారణంగా ఉండి నియోజకవర్గంలో యాత్రల తొలిరోజే అధికార పార్టీ జనంలో అభాసుపాలయ్యింది. జనచైతన్య యాత్రలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే శివరామరాజును వంతెన సమస్యపై ప్రశ్నించిన ఒక యువకుడిని కార్యక్రమం ముగిసి, ఇంటికి వెళ్లిపోయిన అనంతరం ఎస్సై ఆధ్వర్యంలో బలవంతంగా స్టేషన్‌కు తరలించారు. స్థానికుల ఆగ్రహంతో ఎమ్మెల్యే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించారు. వివరాల్లోకి వెళితే... ఉండి నియోజకవర్గంలోని కలిగొట్ల గ్రామంలో మంగళవారం నిర్వహించిన జనచైతన్య యాత్రలో ఎమ్మెల్యే శివరామరాజు పాల్గొన్నారు. యాత్ర అనంతరం భోజనం ముగించుకొని ఎమ్మెల్యే శివరామరాజు వెళ్ళిపోతుండగా గ్రామానికి చెందిన చిన్నా అనే యువకుడు గ్రామంలో వెంకయ్య వయ్యెరుపై వంతెన నిర్మించాలని కోరారు. తప్పనిసరిగా నిర్మిస్తామనిచెప్పి ఎమ్మెల్యే వెళ్ళిపోయారు. అనంతరం అక్కడేవున్న ఉండి ఎస్సై రవివర్మ ఈ విషయమై ఆ చిన్నాను హెచ్చరించారు. సమస్య గురించి అడిగితే అరెస్టు చేస్తారా అని చిన్నా ప్రశ్నించడంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. అక్కడున్న స్థానిక పెద్దలు సర్దిచెప్పి, చిన్నాను ఇంటికి పంపించేశారు. అయితే ఆగ్రహంతో ఊగిపోతున్న ఎస్సై రవివర్మ కొందరు కానిస్టేబుళ్లతో కలిసి చిన్న ఇంటికి వెళ్లి, అతడిని బలవంతంగా బైక్‌పై ఎక్కించుకుని స్టేషన్‌కు తరలించారు. చిన్నకు ఇటీవలే కాలికి శస్తచ్రికిత్స జరిగింది. స్టిక్ సాయంతో నడవలేని స్థితిలో ఉన్న చిన్నాను మన్నించి వదిలేయాలని అతని తల్లి ఎస్సైను ప్రాథేయపడింది. అయినా శాంతించని ఎస్సై యువకుడ్ని స్టేషనుకు తరలించారు. ‘ప్రజా సమస్యపై ప్రశ్నిస్తే అరెస్టుచేసేస్తారా’ అంటూ గ్రామంలోని యువకులు పోలీసు స్టేషను వద్ద ఆందోళనకు ఉపక్రమించారు. కలిగొట్ల నుండి కోలమూరు గ్రామం వెళ్లిన ఎమ్మెల్యే శివరామరాజుకు ఈ విషయం తెలిసింది. కలిగొట్లకు చెందిన యువకులను, పార్టీ నాయకులను పిలిచి వివరాలు తెలుసుకున్నారు. వెంటనే ఎస్సై రవివర్మతో ఫోనులో మాట్లాడి ఎవరూ చెప్పకుండా చిన్నాను ఎందుకు అదుపులోకి తీసుకున్నారని మందలించారు. వెంటనే అతడిని కలిగొట్లలో వదిలేయాలని ఆదేశించడంతో వివాదం సద్దుమణిగింది. ప్రభుత్వ పథకాలు, ప్రజా సమస్యలపై చైతన్యపర్చడం కోసం నిర్వహిస్తున్న జనచైతన్య యాత్రలో కేవలం ఒక వంతెన సమస్యపై ఎమ్మెల్యేను ప్రశ్నించినందుకు పోలీసులు నిర్బంధించడంపై ప్రజల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ప్రశ్నించడాన్ని తట్టుకోలేనపుడు యాత్రలు నిర్వహించడం ఎందుకని వ్యాఖ్యానిస్తున్నారు.

కొడుకును వదిలేయమని ఎస్సైను ప్రాధేయపడుతున్న చిన్నా తల్లి