రాష్ట్రీయం

పెట్రోలు బంకుల దేశవ్యాప్త నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 2: డీలర్ల మార్జిన్‌పై అపూర్వ చంద్ర కమిటీ సిఫార్సులను అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా పెట్రోలు బంక్‌ల నిర్వాహకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 3,4 తేదీల్లో ఆయిల్ కొనుగోలు నిలిపి వేస్తున్నామని, 5వ తేదీ నుంచి 8గంటలు మాత్రమే అమ్మకాలు జరుగుతాయని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ తెలిపింది. ఈనెల 6వ తేదీ నుంచి పనిదినాలలో మాత్రమే పెట్రోలు అమ్మకాలు జరుగుతాయని, ప్రతి ఆదివారం, బ్యాంక్, ప్రభుత్వ సెలవుల్లో అమ్మకాలు నిలిపివేస్తున్నట్టు డీలర్స్ అసోసియేషన్ పేర్కొంది. డీలర్ల మార్జిన్‌పై 2011లో కేంద్రప్రభుత్వం నియమించిన అపూర్వ చంద్ర కమిటీ సిఫార్సులను అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించినా ఆయిల్ కంపెనీలు అమలుచేయకపోవడంతో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టామని అసోసియేషన్ తెలిపింది.