తెలంగాణ

మార్కెట్ విలువను సవరించకుండా భూసేకరణ ఎలా చేస్తారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 2: తెలంగాణ రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువను పరిగణనలోకి తీసుకోకుండా రాష్ట్రప్రభుత్వం ఏ విధంగా భూమి సేకరణకు నోటిఫికేషన్‌ను జారీ చేస్తుందని హైకోర్టు బుధవారం తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ గతంలో 2012లో భూమి మార్కెట్ విలువలను సవరణ చేశారని పేర్కొన్నారు. భూసేకరణ సమయంలో మార్కెట్ విలువలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. తెలంగాణ అడ్వకేట్ జనరల్ కె రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ, భూమి విలువలను సవరణ చేయడమనేది ప్రభుత్వ విధానానికి సంబంధించిన అంశమన్నారు. మార్కెట్ విలువలకు సవరణ చేయడంపై ఎటువంటి నిషేధం లేదన్నారు. ఈ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం జోక్యం చేసుకుని ప్రతి రెండేళ్లకోసారి మార్కెట్ విలువలను సవరించాలనే నిబంధన ఉంటే ప్రభుత్వం ఎందుకు సవరణలు చేయడం లేదని ప్రశ్నించింది. ఏజి బదులిస్తూ జిల్లా కలెక్టర్లు భూమి విలువలను నిర్ణయిస్తారన్నారు. భూసేకరణ కోసమని భూమి విలువలను సవరించాలని లేదని, దీనికి అనేక పద్ధతులు అమలులో ఉన్నాయన్నారు. అనంతరం కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలుచేసేందుకు ప్రభుత్వానికి రెండు వారాల గడువు ఇస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం ఈ కేసు విచారణను ఈ నెల 16కు వాయిదా వేశారు.