ఆంధ్రప్రదేశ్‌

ఏఓబిలో ‘కోబ్రా’ ఆపరేషన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, నవంబర్ 2: ఇటీవల ఎఒబిలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా మావోలు గురువారం నిర్వహించనున్న ఐదు రాష్ట్రాల బంద్ పిలుపునకు ముందస్తు చర్యలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా ‘కోబ్రా’ ఆపరేషన్‌కు రంగం సిద్ధం చేశాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్‌ఎఫ్), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్)తోపాటు ప్రత్యేకంగా కోబ్రా 202 బెటాలియన్ రంగంలోకి దిగింది. గ్రేహౌండ్స్, ఐఆర్‌బి విభాగాలతో సంయుక్తంగా కోబ్రా 202 బెటాలియన్ పనిచేస్తోంది. అలాగే ఆంధ్రా, ఒడిశా, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, తెలంగాణాలో డిస్ట్రిక్ట్ వాలంటరీ ఫోర్స్ కూడా రంగంలోకి ప్రవేశించింది. వీరంతా ఏకకాలంలో దట్టమైన అడవులు, కనుమలు, కొండలు, వాగులు దాటుకుంటూ ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలనైనా ఎదుర్కొంటూ భూమిలో పాతిపెట్టిన మందు పాత్రలను వెలికితీస్తూ దూసుకుపోయే సాంకేతిక పరిజ్ఞానంతో పాటు, దృఢమైన మైండ్‌సెట్ కలిగి రాటుతేలిన టీం ఇది. ఎఒబిలో కీలకమైన మావోల సేఫ్టీ జోన్లకు వెళ్లే మార్గాలైన సుంకి, రల్లిగడ, పెట్రా, గుణుపూర్, నారాయణపట్నం, బొందువా ప్రాంతాల్లో బిఎస్‌ఎఫ్ చెక్‌పోస్టులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసారు. శ్రీకాకుళం జిల్లా నుంచి ఎఒబిలోకి ప్రవేశించే ఒడిశా ప్రాంతం గజపతి జిల్లాలో మోహన, వడబ ప్రాంతాల్లో కూంబింగ్ పెంచినట్టు విశ్వసనీయ సమాచారం. మొత్తంగా అయిదు రాష్ట్రాల్లోని తొమ్మిది జిల్లాల్లో ఈ కోబ్రా ఆపరేషన్ మావోల బంద్ కారణంగా ఎటువంటి ప్రతీకార చర్యలు జరగకుండా చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యూహాన్ని రచించినట్టు తెలిసింది. ఎఒబి సరిహద్దుల్లో ఇచ్ఛాపురం, బారువ, మెళియాపుట్టి, కొత్తూరు, సీతంపేట, బారువా, శ్రీకాకుళం ప్రాంతాల్లో బుధవారం అర్థరాత్రి నుంచి పెట్రోల్, డీజిల్ అమ్మకాలు నిలిపివేసేలా పోలీస్ శాఖ ప్రత్యేక ఆదేశాలు ఇచ్చింది. ముఖ్యంగా శ్రీకాకుళం, పలాస, పాలకొండ ఆర్టీసీ డిపోల నుంచి మావో ప్రభావిత ప్రాంతాలకు వెళ్ళే 14 షెడ్యూళ్ల బస్సులు, 48 రూట్ బస్సుల రాకపోకలను రద్దు చేస్తూ ఆర్టీసీ అధికారులకు ఆ శాఖ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. జన చైతన్య యాత్రల పేరిట ప్రజాప్రతినిధులు గురువారం పోలీసుల అనుమతి లేకుండా గ్రామాల్లోకి వెళ్ళరాదంటూ ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి సంబంధిత ప్రజాప్రతినిధులకు సమాచారం అందించారు.
గిరిజన పల్లెల్లో తీవ్ర ఉద్రిక్తత
భద్రాచలం: గిరిజన పల్లెల్లో పోలీసుల కవాతు, కూంబింగ్, మరోవైపు మావోయిస్టుల వాల్‌పోస్టర్ల ప్రచారం, కవ్వింపు చర్యలతో ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం, తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల సరిహద్దుల్లోని పోలీసులు అడుగడుగునా నిఘాను కట్టుదిట్టం చేశారు. మావోయిస్టుల బంధువుల ఇళ్లకు వచ్చే కొత్త వ్యక్తుల వివరాలు తెలుసుకుంటూ, వారి గురించి ఆరా తీస్తున్నారు. భద్రాచలంలోని లాడ్జిలు, ఆసుపత్రులను తనిఖీ చేశారు.
తూర్పు కనుమల్లో డ్రోన్‌లు
రాజమహేంద్రవరం: తూర్పు కనుమల్లో సాయుధ పోలీసు ప్రత్యేక బలగాలు మోహరించాయి. పోలీసులు డ్రోన్ కెమెరాలను సైతం ఆపరేట్ చేస్తున్నారు. భారీ ఎన్‌కౌంటర్ ఘటనా ప్రాంతంలో నిజనిర్ధారణ జరపడానికి 5,6 తేదీలలో దేశవ్యాప్తంగా అన్ని పౌరహక్కుల సంఘాల ఉమ్మడి బృందం పర్యటించనుంది.
మైదాన ప్రాంతాలకు నేతలు
విశాఖపట్నం: ప్రజాప్రతినిధులు, పోలీసులు, పోలీస్ స్టేషనే్ల లక్ష్యంగా మావోయిస్ట్‌లు విధ్వంసానికి పాల్పడతారన్న కథనాలు వినిపిస్తున్నాయి. బెజ్జంగి ఎన్‌కౌంటర్ జరిగిన తరువాత ఘటనా స్థలం నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న ల్యాప్ టాప్‌లో మావోల హిట్ లిస్ట్‌లో సుమారు 20 మంది ప్రజా ప్రతినిధులు, నాయకులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో పోలీస్ స్టేషన్లకు భారీ భద్రత కల్పించారు. ఒక్కో పోలీస్ స్టేషన్‌లో సాధారణ పోలీసులతోపాటు అదనంగా 30 మంది సిఆర్‌పిఎఫ్ బలగాలను నియమించారు. మంత్రి అయ్యన్నపాత్రుడికి భద్రతను కట్టుదిట్టం చేశారు. బులెట్ ప్రూఫ్ వాహనాన్ని ప్రభుత్వం కేటాయించింది. చాలామంది ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నాయకులు మైదాన ప్రాంతాలకు వచ్చి తలదాచుకుంటున్నారు.
తెలంగాణలో హై అలర్ట్
హైదరాబాద్: తెలంగాణలో ఆదిలాబాద్, కొమురం బీం అసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, భద్రాది కొత్తగూడెం, ఖమ్మంలతో పాటు నల్లమల అడవుల చుట్టూ విస్తరించిన ఉన్న మహబూబ్‌నగర్, నల్లగొండ, గుంటూరు, కర్నూలు, కడప జిల్లాల్లో పోలీసుల బలగాలను మోహరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌తో పాటు మంత్రులు, ఆంధ్ర ప్రదేశ్‌లో అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల ఇండ్ల వద్ద పోలీసు భద్రతను పెంచారు. రెండు రాష్ట్రాల్లో వామపక్ష తీవ్రవాదం ఆధిపత్యం ఉన్న ప్రాంతాల్లోకి జిల్లా ఎస్పీలకు ముందు తెలియచేయకుండా పార్టీల ప్రతినిధులు వెళ్లరాదని పోలీసులు హెచ్చరించారు.
కేంద్రం హెచ్చరికలు
మావోయిస్టుల బంద్ నేపథ్యంలో ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌గడ్, మహారాష్టల్రో రాష్ట్ర పోలీసు శాఖ పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. అన్ని కేంద్రప్రభుత్వ కార్యాలయాలతోపాటు మైనింగ్ శాఖలు, గనుల ప్రాంతాల వద్ద ప్రభుత్వ ఆస్తులకు నక్సలైట్లు నష్టం కలిగించకుండా భద్రత చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం డిజిపిలను ఆదేశించింది.