రాష్ట్రీయం

ఎన్టీఆర్ వైద్యసేవకు మరింత వెలుగు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 3: రాష్ట్రంలో ఉచిత వైద్యసేవలను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. పేదలు, బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఉచిత వైద్యం చేసేందుకు ఇస్తున్న ఆర్థిక సాయాన్ని రూ.2లక్షల నుంచి రూ.2.5లక్షలకు పెంచిన ప్రభుత్వం, తాజాగా గుండె, ఊపిరితిత్తుల మార్పిడి అంశాలను కూడా ఈ పరిధిలోకి తీసుకువచ్చింది. రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్యసేవ కింద 421 ఆసుపత్రులు వైద్యసేవలు అందిస్తున్నాయి. నవంబర్ 1 వరకు రాష్ట్రంలో ఇన్‌పేషంట్లు, అవుట్ పేషంట్లు మొత్తం 66లక్షల మందికి వైద్యసేవ పథకం ద్వారా చికిత్స చేశారని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. ఎలాంటి ఖర్చు లేకుండా అన్నివిధాలుగా ఈ పథకం కింద తెల్లరేషన్ కార్డు ఉన్న వారందరికీ అందిస్తున్నామని, ఇంతకుముందు ఉన్న 944 చికిత్సలకు అదనంగా 100 చికిత్సలను ఈ పరిధిలోకి తీసుకువచ్చినట్లు పేర్కొంది. ఏడాదికి ఒక కుటుంబానికి ఇంతకుముందు ఇస్తున్న ఉచిత వైద్యసహాయాన్ని రూ.2లక్షల నుంచి రూ.2.5లక్షలకు పెంచినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. వినికిడి లోపం ఉన్న చిన్న పిల్లలకు చేసే కాక్లియార్ ఇంప్లాటేషన్‌కు రూ.6 లక్షల వరకు, మూత్రపిండ మార్పిడి లాంటి క్లిష్టతరమైన ఆపరేషన్లకు రూ.3.5లక్షల వరకు ఈ పథకం కింద లబ్ధిపొందవచ్చు. గుండె, ఊపిరితిత్తులు మార్పిడి చికిత్స కూడా ఈ పథకంలో చేర్చారు. ఎన్టీఆర్ వైద్యసేవ పథకం ద్వారా లబ్ధి పొందిన వారి వివరాలను కూడా ప్రభుత్వం ప్రకటించింది. 2014 జూన్ 2 నుంచి ముందుగా అనుమతి తీసుకుని వైద్యం చేయించుకున్న వారు 8.65 లక్షల మంది అని, వారి చికిత్స కోసం అయిన మొత్తం 2,528 కోట్లు అని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఎన్టీఆర్ వైద్య సేవ కింద చేసిన మొత్తం ఆపరేషన్లు 8.54లక్షలుగా పేర్కొన్నారు.