రాష్ట్రీయం

పంచాయతీలుగా ఇక తండాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 3: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తండాలను పంచాయతీలుగా మార్చే ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తండాలను పంచాయతీలుగా మార్చేందుకు గతంలోనే క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. తండాలను పంచాయతీలుగా మార్చడానికి అవసరం అయిన ప్రక్రియను ప్రారంభించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పంచాయతీరాజ్ శాఖ అధికారులను ఆదేశించారు.
ప్రస్తుతం ఉన్న పంచాయతీల పదవీ కాలం ముగిసిన తరువాతనే తండాలు పంచాయతీలుగా మారుతాయి. 14వ ఆర్థిక సంఘం ద్వారా గ్రామ పంచాయతీలకు 900 కోట్ల రూపాయలు విడుదల కావలసి ఉంది. ఈ నిధులు వెంటనే విడుదల చేయాలని ఆయన కేంద్రాన్ని కోరారు. అధికారులు ఈ అంశంపై దృష్టిసారించి, నిధులు వచ్చేట్టు చూడాలని మంత్రి ఆదేశించారు.
పంచాయతీరాజ్ వ్యవస్థలోని ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనంగా చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖపై మంత్రి జూపల్లి గురువారం సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ, గ్రామ పంచాయతీల పనులకు సంబంధించిన వివరాలు ఆన్‌లైన్‌లో ఉంచేందుకు కొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాలని సమావేశంలో చర్చించారు. కేంద్ర ప్రభుత్వ పథకం రూరల్ అర్బన్ మిషన్ రెండవ విడత కింద ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఉపాధి హామీ పథకంలో అదనంగా ఆరుకోట్ల పని దినాలను కేంద్రాన్ని కోరాలని నిర్ణయించారు. ఈ మేరకు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నట్టు మంత్రి చెప్పారు. అసంపూర్తిగా ఉన్న అంగన్‌వాడి, గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.
కేరళ పర్యటనలో మంత్రి
పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కేరళలో గ్రామ పంచాయతీల పనితీరు పరిశీలించేందుకు రెండు రోజుల పర్యటన కోసం వెళ్లారు. కేరళలో పంచాయతీ వ్యవస్థను పరిశీలిస్తారు. శుక్రవారం నాడు కేరళలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లోకల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్, సభ్యులతో సమావేశం అవుతారు. పంచాయతీరాజ్ వ్యవస్థ, రాష్ట్రంలోని ఆదాయ వనరులు, స్థానిక సంస్థల పనితీరుపై చర్చిస్తారు. వెంకిటింగు గ్రామ పంచాయతీని సందర్శించి గ్రామస్థులతో మాట్లాడుతారు. శనివారం ఎర్నాకులం జిల్లా ఒట్టపాలెం బ్లాక్ పంచాయతీని సందర్శిస్తారు.