ఆంధ్రప్రదేశ్‌

అమరావతిలో కాలచక్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 4: ‘మన సంప్రదాయ నాట్యమైన కూచిపూడి కళా నైపుణ్యపు వెలుగులు ప్రపంచమంతా ప్రసరించాలి. రాష్ట్ర కళారూపాలను దశదిశలా చాటాలి. ఉనికిని కాపాడుకోవటమే కాదు, ఉజ్వలస్థాయిలో ప్రతిఫలించాలి’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు స్పష్టం చేశారు. విభజన నేపథ్యంలో రాష్ట్ర కళా సంస్కృతులను మరో పర్యాయం ప్రపంచానికి చాటి చెప్పాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు. ఉండవల్లిలో శుక్రవారం సాయంత్రం పర్యాటక రంగ ప్రగతిపై ముఖ్యమంత్రి సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ప్రతి ఉత్సవం, పండుగలను కూచిపూడి ప్రదర్శనతోనే ప్రారంభించాలని కోరారు. నవ్యాంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘కాలచక్ర’ నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. బుద్ధ భగవానుని పాదస్పర్శతో పులకించిన అమరావతిలో దలైలామా తొమ్మిదేళ్ల క్రితం జ్ఞానబోధ చేసిన నేలమీద, కృష్ణాతీరాన ‘కాలచక్ర’ నిర్వహిస్తామని, బౌద్ధ మత గురువు దలైలామాను ఆహ్వానిస్తామని తెలిపారు. ఇందుకు సమగ్ర ప్రణాళికను రూపొందించాలని ముఖ్యమంత్రి కోరారు.
ప్రపంచంలోని 71 దేశాల నుంచి బౌద్ధమత గురువులు, బిక్షువులు పాల్గొనేలా ప్రణాళికా రచన చేయాలన్నారు. సీతానగరం కొండమీద యావత్ ప్రపంచాన్ని ఆకట్టుకునేలా అతి పెద్ద బుద్ధ విగ్రహం ప్రతిష్ఠిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పర్యాటక రంగమే రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఆదాయ వనరు అని, విభిన్న అంశాలతో, వైవిధ్య భావనలతో రూపొందించిన పర్యాటక నడవాల ద్వారా ఆదాయం తేవాలని కోరారు. ఆధ్యాత్మిక పర్యాటకం, తీరప్రాంత పర్యాటకం, హెలి పర్యాటకం, పర్యావరణ పర్యాటకం ద్వారా పర్యాటకుల్ని ఆకర్షించాలని సూచించారు. విలాస, వినోద పన్నుపై నూరు శాతం విద్యుత్ రాయితీలిస్తున్న అంశాన్ని వారు వివరించగా, సమగ్రంగా అధ్యయనం చేశాక ఒక నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారు.
జాతీయస్థాయలో ఆహారోత్సవాలు
విజయవాడ, తిరుపతిలో ప్రాంతీయ వంటకాల పోటీలు పూర్తి చేశామని, విశాఖ ప్రాంతంలో ఈ నెల 8న ఏర్పాటవుతుందని, ఫిబ్రవరి 2017లో భారీస్థాయిలో నిర్వహిస్తామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ ప్రతి జిల్లాకు ప్రత్యేక వంటకాలు ఉన్నాయని, వాటిని ప్రపంచానికి పరిచయం చేయటానికి ఆహారోత్సవాలు గొప్ప వేదికలన్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లో అన్ని జిల్లాలో వీటిని నిర్వహించాలని కోరారు.
వచ్చే జనవరిలో విజయవాడలో రాష్టస్థ్రాయి వంటకాల పోటీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. వచ్చే ఏడాది విజయవాడ, తిరుపతి, విశాఖల్లో రాష్టస్థ్రాయి ఫుడ్ ఫెస్టివల్స్‌కు ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో జాతీయస్థాయి ఆహారోత్సవాలకు సన్నాహాలు చేయాలని ముఖ్యమంత్రి కోరారు.
రాష్ట్రంలో టూరిజం ఈవెంట్స్ 18, సాంస్కృతిక సంబరాలు 45, సాంస్కృతిక వారసత్వ ఉత్సవాలు 3, వంటల పోటీలు 36, వెండితెర, బుల్లితెరకు సంబంధించి 33 అంశాల్లో వేడుకలు నిర్వహించటానికి ప్రణాళికలను పర్యాటక శాఖ అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. జిల్లాల్లో ఆయా జిల్లాల సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే జాతరలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి స్పందిస్తూ నిరుద్యోగులకు ఉపాధి కల్పించటంలో పర్యాటక శాఖ దిక్సూచిలాంటిదని, యువతకు ఉపాధి కల్పించే అంశంలో తాను పర్యాటకశాఖపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సమావేశంలో పర్యాటక శాఖ ముఖ్యకార్యదర్శి ఎన్.శ్రీకాంత్, ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి జి.సాయిప్రసాద్, ఎపిటిడిసి ఎండి గిరిజా శంకర్, కమిషనర్ ఖజూరియా, దేవాదాయ శాఖ డైరెక్టర్ వి.రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం... విజయవాడలో శుక్రవారం టూరిజంపై జరిపిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు