రాష్ట్రీయం

సంస్థానాల విలీనం సర్దార్ పటేల్ ఘనతే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 4: సంస్థానాల విలీనంలో సర్దార్ వల్లబ్‌భాయ్ పటేల్ చేసిన కృషి అమోఘమని కేంద్ర న్యాయ, ఐటి శాఖల మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. రాష్ట్రీయ ఏక్తా దివస్ సందర్భంగా బిజెపి నేతలతో కలిసి రవిశంకర్ సచివాలయం సమీపంలోని సర్దార్ వల్లబ్‌భాయ్ పటేల్ స్మారక స్థూపానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పటేల్ లేనిదే హైదరాబాద్ లేదని, పటేల్ లేనిదే సమైక్య భారతాన్ని కూడా ఊహించలేమని అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్, మాజీ అధ్యక్షుడు జి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్, బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ నర్సింహారెడ్డి, బిజెపి థింక్ ట్యాంక్ చైర్మన్ దినేష్‌రెడ్డి, ప్రొఫెసర్ బి సత్యనారాయణ, జిజికె టెక్నాలజీస్ ఎండి రఘు వీరబెల్లి పాల్గొన్నారు.

ఆర్కే ఆచూకీపై పిటిషన్‌ను
ఉపసంహరించుకున్న ఆర్కే భార్య
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, నవంబర్ 4: తన భర్త మావోయిస్టు నేత అక్కిరాజు రామకృష్ణ అలియాస్ ఆర్కే సురక్షితంగా ఉన్నట్లు సమాచారం అందినందువల్ల ఆచూకీ కనుగొనాలని దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు రామకృష్ణ భార్య శిరీష కోర్టుకు తెలిపారు. ఈ మేరకు ఆమె శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. గత నెల 24వ తేదీన మల్కన్‌గిరి ఎన్‌కౌంటర్ తర్వాత తన భర్త కనపడకుండా పోయారని, పోలీసుల కస్టడీలో ఉంటారని, రక్షణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలుచేసిన విషయం విదితమే. కాగా గత రాత్రి విరసం నేత వరవరరావు ప్రకటన చేస్తూ ఆర్కే క్షేమంగా ఉన్నట్లు ధృవీకరణ లభించిందని, కాని ఎక్కడ ఉన్నారో తెలుసుకోలేదని పత్రికలకు వెల్లడించారు.