రాష్ట్రీయం

కేసుల పరిష్కారంలో మధ్యవర్తిత్వం కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 5: కేసుల పరిష్కారానికి మధ్యవర్తిత్వం ఎంతో ముఖ్యమైందని, చట్టబద్దత లేకపోయినా, ఇది చాలా కీలకంగా మారిందని హైకోర్టు న్యాయమూర్తి ఎ.రామలింగేశ్వరరావు అన్నారు. ప్రత్యామ్నాయ వివాదాల పరిష్కార అంతర్జాతీయ కేంద్రం (ఐసిఎడిఆర్), తెలంగాణ రాష్ట్ర లీగల్ సెల్ అథారిటీ సంయుక్త ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వంపై న్యాయాధికారులకు నిర్వహిస్తున్న అవగాహన తరగతులను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్ రామలింగేశ్వరరావు మాట్లాడుతూ, కోర్టుల్లో పెరుగుతున్న పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించేందుకు ఇరువర్గాల మధ్యరాజీ కుదర్చడం న్యాయవ్యవస్థలో ఇప్పటికే అమల్లో ఉన్న విధానమని, అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ విధానం చాలా విస్తృతంగా అమలవుతోందని వివరించారు. ఈ విధానం పట్ల పూర్తి అవగాహన కలిగినపుడే కేసులను విజయవంతంగా పరిష్కరించటం సాధ్యమవుతుందని, కనుక న్యాయాధికారులంతా ఈ తరగతుల్లో కేవలం ప్రసంగాలు వినేందుకు పరిమితం కాకుండా పొగ్రామ్‌లో భాగస్వాములు కావాలని ఆయన సూచించారు. రంగారెడ్డి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి, ఐసిఎడిఆర్ ప్రాంతీయ కేంద్రం ఇన్‌ఛార్జి కార్యదర్శి జెఎల్‌ఎన్.మూర్తి, పలువురు న్యాయవాదులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.