రాష్ట్రీయం

80 మార్కులకే పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 5: ఆంధ్రప్రదేశ్‌లోనూ 2016-17 విద్యాసంవత్సరం నుండి పదోతరగతి విద్యార్థులకు తుది పరీక్షలు ఒక్కో పేపర్ 80 మార్కులకు మాత్రమే నిర్వహించనున్నారు. మిగిలిన 20 మార్కులను సంబంధిత పాఠశాల ఉపాధ్యాయులే కేటాయిస్తారు. ఆరు సబ్జెక్టుల్లో మొత్తం 11 పేపర్లు నిర్వహిస్తారు. పరీక్ష సమయం 2.30 గంటలు కాగా, ప్రశ్నాపత్రం చదువుకోవడానికి మరో 15 నిమిషాలు అదనంగా కేటాయించనున్నారు. సెకండ్ లాంగ్వేజి హిందీలో 80 మార్కులకు 16 మార్కులు వస్తే సరిపోతుంది. మిగిలిన సబ్జెక్టుల్లో 80 మార్కులకు గానూ కనీసం 27 మార్కులు రావల్సి ఉంటుంది. అంటే 20 శాతం మార్కులకు ఉండే ఇంటర్నల్స్‌లో కనసం అభ్యర్థి 8 మార్కులు సాధించాల్సి ఉంటుంది. దానిని స్వల్పంగా సవరించి సబ్జెక్టులో 28 మార్కులు సాధిస్తే ఇంటర్నల్స్‌లో కనీసం ఏడు మార్కులు సాధించాలి. అంతకంటే తక్కువ మార్కులు ఇంటర్నల్స్‌లో వచ్చినట్టయితే ఆ మేరకు మెయిన్ పరీక్షల్లో మార్కులు సాధించాల్సి ఉంటుంది. గతంలో చదివిన 8,9 తరగతుల మార్కులకు 5 శాతం వెయిటేజీ ఇస్తారు. అయితే ఈ విషయం గతంలో చెప్పలేదు కనుక ఈ ఏడాది వరకూ మొత్తం మార్కులను కేటాయించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.