రాష్ట్రీయం

నైపుణ్యతతోనే ఉపాధి అవకాశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 5: ప్రస్తుత కాలంలో తమలో అంతర్లీనంగా దాగివున్న ప్రతిభకు పదును పెట్టడం ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారత సహసర్ కార్యవాహ్ ఆర్.బాగయ్య అన్నారు. గుంటూరు జిల్లా నూతక్కిలో సేవాభారతి ఆధ్వర్యంలో 12 కంప్యూటర్లతో ఏర్పాటైన ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే తెనాలి, అనంతపురం, కృష్ణాజిల్లా మోపిదేవిలో ఇలాంటి కేంద్రాలను ప్రారంభించనున్నట్టు చెప్పారు. ఈ కేంద్రాల్లో దశలవారీగా మోటార్ వైండింగ్, ఫ్రిజ్, ఏసి, మెకానిక్, కరెంట్ వైరింగ్ వంటి కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తామని, శిక్షణ కార్యక్రమంలో మహిళలకు ప్రాధాన్యత ఇస్తామని, శిక్షణ అనంతరం సర్ట్ఫికెట్లు కూడా ప్రదానం చేస్తామని బాగయ్య చెప్పారు. అంతేకాకుండా శిక్షణ పొందిన వారికి ఉపాధికి మార్గం కూడా చూపెడతామని వివరించారు. కార్యక్రమంలో సేవాభారతి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కాకని పృథ్వీరాజ్, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

చిత్రం.. శనివారం నూతక్కిలో కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్ నేత బాగయ్య