రాష్ట్రీయం

మంత్రి గంటా మాజీ పిఏ ఇంట్లో ఎసిబి సోదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (మధురవాడ), నవంబర్ 5: ఆంధ్రప్రదేశ్‌లో పశు సంవర్ధక శాఖలో వైద్యుడిగా పనిచేస్తున్న గిరడా కాంతి కిరణ్ ఇంట్లో ఎసిబి అధికారులు శనివారం విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో ఎసిబి డిఎస్పీ రామకృష్ణ ప్రసాద్ నేతృత్వంలో ఏకకాలంలో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, హైదారాబాద్ జిల్లాల్లోని 11 చోట్ల దాడులు నిర్వహించారు. విశాఖ నగరానికి సమీపంలోని కొమ్మాదిలోని ఆయన నివాసంతో పాటు బంధువులు, స్నేహితులు, తల్లిదండ్రుల ఇళ్లల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. శనివారం సాయంత్రానికి సుమారు రూ. 2కోట్ల ఆస్తులు గుర్తించినట్లు ఎసిబి డిఎస్పీ తెలిపారు.
వీటి మార్కెట్ విలువ ఆరు కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. గతంలో కాంతి కిరణ్ మంత్రి గంటా శ్రీనివాసరావు వద్ద అడిషనల్ ప్రైవేట్ సెక్రటరీ, లైజనింగ్ అధికారిగా పనిచేశారు. కిరణ్ భార్య సంగీత నగరంలో ఒక బ్యాంక్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నారని డిఎస్పీ తెలిపారు. ప్రస్తుతం కొమ్మాదిలోని మూడుంతస్తుల భవనం, విజయనగరం జిల్లా కొత్తవలసలో ఒక ఇంటి స్థలం, పార్వతీపురంలో 8 ఇళ్ల స్థలాలు, సుమారు రూ. 50 లక్షల విలువ చేసే ఇల్లు, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో ఒక ఇంటి స్థలం, రెండు ఖరీదైన కార్లు, బంగారు ఆభరణాలు, కొంత నగదు గుర్తించినట్లు డిఎస్పీ తెలిపారు. ఇంట్లో రెండు లాకర్లకు సంబంధించిన తాళాలు లభించాయని, వాటిని తెరవాల్సి ఉందని తెలిపారు. సోదాలు పూర్తయ్యేసరికి ఆస్తులు ఇంకా పెరగవచ్చని డిఎస్పీ తెలిపారు. కిరణ్ గత నాలుగైదేళ్లలో అక్రమ ఆస్తులు సంపాదించారన్న సమాచారం ఉందని, అతని భార్య కూడా ప్రభుత్వ అధికారి కావడంతో ఆమె పేరున ఉన్న ఆస్తులను బట్టి తదుపరి చర్యలు ఉంటాయని డిఎస్పీ రామకృష్ణ ప్రసాద్ తెలిపారు.

చిత్రం.. గంటా మాజీ పిఏ కిరణ్, అతని భార్యను విచారిస్తున్న ఎసిబి అధికారులు