రాష్ట్రీయం

మంట పుట్టిస్తున్న ‘బీచ్ లవ్’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 5: విశాఖలో బీచ్ లవ్ ఫెస్టివల్ మంట పుట్టిస్తోంది. సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమైన విశాఖలో అశ్లీలతతో కూడిన బీచ్ లవ్ ఫెస్టివల్‌ను నిర్వహించడాన్ని వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు నిరసిస్తున్నాయి. అయితే, బీచ్ లవ్ ఫెస్టివల్ కేవలం ప్రతిపాదన మాత్రమేనని, దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని అధికారులు చెపుతున్నారు. సంస్కృతికి భిన్నంగా ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించినా సహించబోమని జిల్లా మంత్రులు అంటున్నారు.
బీచ్ లవ్ ఫెస్టివల్ అంటే..
బీచ్ లవ్ ఫెస్టివల్ అంటే ఏంటి? గోవాలో జరిగే ఈ కార్యక్రమాన్ని విశాఖకు ఎందుకు తీసుకురావాలనుకుంటున్నారు? పర్యాటకంగా విశాఖకు అన్ని అవకాశాలు ఉన్నాయి. పర్యాటక ప్రాజెక్ట్‌ల ఏర్పాటు కోసం ప్రభుత్వాలు ఎన్ని కసరత్తులు చేస్తున్నా, అవి కార్యరూపం దాల్చడం లేదు. విశాఖను ప్రపంచ పటంలో నిలిపేందుకు బీచ్ లవ్ ఫెస్టివల్‌ను ఒక పనిముట్టుగా వాడుకోవాలని ప్రభుత్వం భావించింది.
ముంబయికి చెందిన పాజిటివ్ గ్లోబల్ అండ్ సర్వీసెస్ కన్సల్టెన్సీ సంస్థ ఫిబ్రవరి 12 నుంచి 14 రోజుల పాటు విశాఖలో బీచ్ లవ్ ఫెస్టివల్‌ను నిర్వహించేందుకు ముందుకు వచ్చింది. ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి సుమారు తొమ్మిది వేల ప్రేమ జంటలకు ఆహ్వానాలు పంపిస్తారు. వీరంతా ఈ మూడు రోజుల్లో విశాఖ తీరాన సందడి చేస్తారు. దీంతోపాటు షకీరా లైవ్ షోలు ఏర్పాటు చేస్తారు. ఒక్కో ప్రేమ జంటకు ఒక్కో టెంట్‌ను బీచ్‌లో కేటాయిస్తారు. హాలీవుడ్, బాలీవుడ్ స్టార్స్‌తో ఈవెంట్స్, మిస్టర్ అండ్ మిసెస్ బీచ్ పోటీలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రితో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు హాజరవుతారు. ఐఎఎస్, ఐపిఎస్‌లను కూడా ఆహ్వానిస్తారు. ఈ కార్యక్రమం విజయవంతమైతే, విశాఖ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారు మోగిపోతుందన్నది నిర్వాహకుని అభిప్రాయం. ఈ ఫెస్టివల్‌లో పాల్గొనడానికి భారీ మొత్తాన్ని చెల్లించి టిక్కెట్ కూడా కొనుగోలు చేసుకోవలసి ఉంటుంది. ఈ ఉత్సవాన్ని నిర్వహించడానికి పదెకరాల విస్తీర్ణంతో కూడిన స్థలం బీచ్ ఒడ్డున కావాలి. ఇందుకోసం విశాఖ-్భమిలి మధ్య ఉన్న ఎర్రమట్టి దిబ్బలు ఎదురుగా ఉన్న స్థలాన్ని ఎంపిక చేయాలని భావిస్తున్నారు.
పెట్టుబడుల ఆకర్షణే ‘లవ్’ లక్ష్యమా?
దేశ, విదేశాల నుంచి పెట్టుబడులను ఆహ్వానించేందుకే ఈ బీచ్ లవ్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నారా? అంటే ప్రభుత్వ పెద్దలు అవునంటున్నారు. ఈ ఉత్సవానికి మధ్య ఆసియా, ఐరోపా, అమెరికా, రష్యా, జపాన్, ఆఫ్రికా తదితర దేశాల నుంచి పారిశ్రామికవేత్తలను కూడా ఆహ్వానిస్తున్నారు.
ఎంతవరకు సాధ్యం?
పారిశ్రామికంగా, పర్యాటకంగా ఎదగాలంటే, విశాఖ నగరంలో నైట్ కల్చర్ పెరగాలని పారిశ్రామికవేత్తలు ఇప్పటికే ప్రతిపాదనలు చేశారు. నైట్ కల్చర్ అంటే రాత్రంతా బార్లు, పబ్‌లు తెరిచి ఉంచడం, రవాణా సదుపాయాన్ని రాత్రి పూట కొనసాగిండంతోపాటు విభిన్న కార్యక్రమాలను నిర్వహించాలని ప్రతిపాదించారు. కానీ ప్రభుత్వం అందుకు ముందుకు రాలేదు. విశాఖ ప్రజల జీవన శైలిని తెలుసుకున్న ప్రభుత్వం పారిశ్రామికవేత్తల ప్రతిపాదనలను సున్నితంగా తిరస్కరించింది. అయితే ఈ బీచ్ ఫెస్టివల్ విషయంలో ప్రభుత్వం ఇప్పటి వరకూ ఎటువంటి ప్రకటన చేయకపోవడం వెనుక అనుమానాలు తలెత్తుతున్నాయి. ముంబయి సంస్థ ఇచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి, సాధ్యాసాధ్యాలను పరిశీలించాల్సిందిగా విశాఖ జిల్లా కలెక్టర్‌ను సిఎం ఆదేశించారు. ప్రస్తుతం ఆయన సెలవులో ఉన్నందువలన దీనిపై నిర్ణయం తీసుకోలేదు.
ఒకవేళ ప్రభుత్వం ఈ ఫెస్టివల్ నిర్వహించే దిశగా అడుగులు ముందుకు వేస్తే, పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోక తప్పదు. ప్రజా సంఘాలు, మహిళా సంఘాల నుంచి వస్తున్న నిరససను ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. బీచ్ ఫెస్టివల్ రూపురేఖలను తెలుసుకుంటున్న జనం దానిపట్ల పెదవి విరుస్తున్నారు. పర్యాటకంగా విశాఖ ఎదిగే విషయాన్ని పక్కన పెడితే, ప్రభుత్వం పరువు పోగొట్టడానికి ఈ ఫెస్టివల్ ఇతోధికంగా సహకరిస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.