రాష్ట్రీయం

ఈ-మాటకు కొత్తపీట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 5: శాస్త్ర సాంకేతిక సమాచార విప్లవానికి కేంద్ర బిందువుగా ఉన్న ఇంటర్నెట్ అంశాలపై హైదరాబాద్‌లో జరుగుతున్న తొలి విశ్వ సదస్సుపైనే అందరి దృష్టి పడింది. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్‌నెట్ వినియోగం, నామఫలకాలు, ప్రాంతీయ భాషల్లో వినియోగం, అంతర్జాల చట్టాలు, ప్రభుత్వ ప్రైవేటు సంస్థల భాగస్వామ్యానికి సంబంధించి పెనుమార్పులు చోటుచేసుకోనున్న తరుణంలో సదస్సుకు అత్యధిక ప్రాధాన్యత ఏర్పడింది. ఏడు రోజులపాటు జరిగే ‘ద ఇంటర్నెట్ కార్పొరేషన్ ఆఫ్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్’ (ఐకాన్ -ఐసిఎఎన్‌ఎన్) 57వ సదస్సు కీలక కార్యక్రమాలు శనివారం ప్రారంభమయ్యాయి. భారతదేశంలో ఇంటర్నెట్ విశ్వ సదస్సు జరగడం ఇదే ప్రథమం. రెండు రోజుల క్రితమే సన్నాహక సమావేశాలు ప్రారంభమైనా, అంతర్జాతీయ సదస్సు శనివారం మొదలైంది. సదస్సు వారంపాటు జరుగుతుంది. ఏడు రోజుల్లో రెండు వేదికలపై దాదాపు 355 అంశాలకు సంబంధించి సమాంతరంగా చర్చలు జరుగుతాయి. భారత ప్రభుత్వం రూట్ సర్వర్ ఏర్పాటుకు సన్నాహాలు చేయడం ద్వారా పరోక్షంగా ఇంటర్‌నెట్‌పై ఆధిపత్యానికి ప్రయత్నాలు మొదలెట్టింది. ఈ అంశంపైనా సదస్సులో చర్చ జరగనుంది. గత సెప్టెంబర్‌లో ఇంటర్‌నెట్‌పై అమెరికా ఆధిపత్యానికి తెరదించిన తర్వాత జరుగుతున్న తొలి సమావేశం భారత్‌లోనూ, అందులో హైదరాబాద్‌లో జరగడం విశేష ప్రాధాన్యత సంతరించుకుంది. సదస్సులో సైబర్ సెక్యూరిటీపై కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అదేవిధంగా భవిష్యత్‌లో డొమైన్ పేర్ల వ్యవస్థకు కొత్త రూపమిస్తారు. ప్రాంతీయ భాషల్లో డొమైన్లు రిజిస్టర్ చేయడంతో పాటు అందుకు సంబంధించిన కొత్త చట్టాలు రూపకల్పనకు ప్రయత్నిస్తారు. ఇంటర్‌నెట్ సుపరిపాలనపైనా చర్చలు జరుగుతాయి. ఇటీవల ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కారణంగా వస్తున్న చిక్కులపై పరిష్కారాలు అనే్వషిస్తారు. వివిధ దేశాలకు కేటాయించిన సంఖ్యలు, సంక్షిప్త నామాలను పునఃసమీక్షతో పాటు కొత్త అవసరాలను దృష్టిలో ఉంచుకుని అందుకు తగిన సన్నాహాలు చేస్తారు. ఇంటర్‌నెట్ వినియోగదారుల అవసరాలు, వ్యాపారాత్మక అంశాలు, మేథోసంపత్తి వ్యవహారాలు, ప్రభుత్వ సంస్థలు- ప్రైవేటు వ్యక్తుల మధ్య నెట్ వినియోగ అంశాలు, ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఐపి చిరునామాలు, గవర్నమెంటల్ అడ్వయిజరీ కమిటీలు, సెక్యూరిటీ అడ్వయిజరీ కమిటీలు ఇతర సంస్థల వ్యవహారాలను కూడా చర్చిస్తారు.
శనివారం హైటెక్స్ నోవా టెల్ హోటల్‌లో మొదలైన ఐసియాన్ సదస్సులో కేంద్రమంత్రి కమ్యూనికేషన్లు, ఐటి, న్యాయశాఖ మంత్రి రవిశంకర్, తెలంగాణ ఐటి శాఖా మంత్రి కె తారక రామారావు సహా వివిధ దేశాల నుంచి వచ్చిన 3వేల మంది ప్రతినిధులు పాల్గొన్నారు.