రాష్ట్రీయం

మహిళలకే పట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, నవంబర్ 5: ‘మహిళల శక్తి అనన్యసామాన్యమైనది, వారు తలుచుకుంటే ఏదైనా సాధించే శక్తి ఉంది. వారికి అవకాశం కల్పిస్తే సమాజాభివృద్ధికి పాటుపడతారు. అందుకే వారికి ఎన్ని అవకాశాలు ఉంటే వాటన్నింటినీ కల్పించి రాష్ట్భ్రావృద్ధికి పాటుపడుతున్నాన’ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. కర్నూలులో శనివారం ఏర్పాటు చేసిన జన చైతన్యయాత్ర, పొదుపు మహిళలకు రెండవ విడత పెట్టుబడి నిధి పంపిణి కార్యక్రమాల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. మహిళలకు ఇచ్చిన డ్వాక్రా రుణమాఫీని ఎట్టి పరిస్థితుల్లో అమలు చేసి తీరుతానని మరోమారు స్పష్టం చేశారు. పాల డెయిరీల ఏర్పాటుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందని, వాటిని ఏర్పాటు చేయాలనుకునే మహిళలకు 50శాతం సబ్సిడీ ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు. ఇది కార్యరూపంలోకి వస్తే పాల డెయిరీల ఏర్పాటులో తొలి ప్రాధాన్యం మహిళలకే ఇస్తామని స్పష్టం చేశారు. కట్టెల పొయ్యితో ఇబ్బందులు పడే మహిళలకు దీపం పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నామని గుర్తుచేశారు. వచ్చే ఏడాది జూన్ 2వ తేదీ నాటికి ప్రతి ఇంటికి గ్యాస్ ఇవ్వడమే లక్ష్యంగా నిర్ణయించుకున్నానని సిఎం తెలిపారు. నిరుద్యోగులకు న్యాయం చేయడానికి రాష్ట్రంలో 20వేల ఉద్యోగాల భర్తీకి అంగీకరించామని తెలిపారు. అంతేగాకుండా ఏపిపిఎస్‌సి ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలకు వయోపరిమితిని 42 సంవత్సరాలకు పెంచామని వెల్లడించారు. నిరుద్యోగులకు ఇవ్వాల్సిన భృతి అనర్హుల చేతికి పోకూడదన్న ఉద్దేశంతో ఉద్యోగం చేయాలని భావించే నిరుద్యోగుల్లో నైపుణ్యాభివృద్ధికి ఆ సొమ్ము ఖర్చు చేస్తున్నామని తెలిపారు. వైకాపా నేత జగన్ యువతను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఆయన తండ్రి అధికారంలో ఉన్నపుడు ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టినట్లు ఇప్పుడు యువకులు కూడా అలాగే చేయాలని ఆయన బోధిస్తున్నట్లుగా ఉందని విమర్శించారు. అయితే యువకులు ఆయన మాటలు నమ్మడం లేదని తమకు ఉద్యోగం కావాలంటే నైపుణ్యాభివృద్ధి అవసరమన్న ఉద్దేశంతో తమకు సహకరిస్తున్నారని చెప్పారు. కులాల, జలాల చిచ్చును రగిలిస్తూ ఒక వైపు యువతను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూనే మరో వైపు ప్రత్యేక హోదా పేరుతో జనాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని జగన్‌పై మండిపడ్డారు. అయితే ప్రజలు ఆయనకు సహకరించకపోవడంతో ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో పడ్డాడని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు కోరిన విధంగా వారి డిమాండ్లను పరిష్కరించానన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ క్షేమం గురించి ఆలోచించాలని అదే సమయంలో వారి సంక్షేమాన్ని ప్రభుత్వం చూసుకుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు.
గ్రామాలు, పట్టణాల్లోని వార్డుల్లో పార్టీ కోసం పని చేసే కార్యకర్తల మాటకు విలువనివ్వాలని ఇప్పటికే ఎమ్మెల్యే, ఎంపిలను ఆదేశించానని ఆయన కార్యకర్తల సమావేశంలో తెలిపారు. ప్రజల కోసం పని చేసే కార్యకర్తలు వారి వద్ద చేయి చాపి ఏదీ ఆశించవద్దని అలా చేస్తే పార్టీ మునిగిపోతుందని హెచ్చరించారు.

చిత్రం.. జన చైతన్యయాత్రలో భాగంగా కర్నూలులో చేపట్టిన పాదయాత్రలో చిన్నారులతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు