రాష్ట్రీయం

ప్రేమించండి.. సేవించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 5: ప్రేమకు మించినది సమాజంలో మరొకటి లేదు. మీరు ప్రేమను పెంచితే శత్రువు కూడా మిత్రుడవుతారని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అధినేత శ్రీశ్రీ రవిశంకర్‌జీ అన్నారు. అన్ని మతాలు శాంతినే ప్రబోధించాయన్నారు. శనివారం ఇక్కడ ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించిన అంతర్జాతీయ శాంతి సదస్సులో ప్రసంగించారు. ప్రేమ అందరినీ కలుపుతుందని, మతాలు వేరైనా దేవుడొక్కడే అన్నారు. సమాజంలో అన్ని మతాల వారు కలిసి మెలిసి ఉండాలన్నారు. మనస్పర్థలు ఉంటే గాలి కూడా వేడి అవుతుందని, ప్రేమగా ఉంటే వాతావరణం కూడా చల్లగా ఉంటుందన్నారు. కళ్లలో కళ్లుపెట్టి చూసి ప్రేమ భావాలతో శాంతి సందేశం ఇవ్వాలని సూచించారు. రాజస్థాన్‌లోని అజ్మీర్‌లోని హజ్రత్ కాజా గరీబ్ నవాజ్‌కు చెందిన దివాన్ హజ్రత్ సయ్యద్ జైనుల్ అబెదీన్ అలీఖాన్ మాట్లాడుతూ ఉపనిషత్తులు, వేదాలు, సూఫీ, ఇస్లాం, క్రైస్తవం అన్నీ సమాజంలో భేదభావం లేకుండా కలిసిమెలసి ఉండాలని చెబుతున్నాయన్నారు. ఎవరికీ దుఖం, కష్టం కలిగించకూడదన్నారు. దేవుని అవసరం మనకు ఉందికానీ, మన అవసరం దేవునికి లేదని గుర్తించాలన్నారు. సూపర్ పవర్, న్యూక్లియర్ వంటి ప్రయోగాలు చేయవద్దని హితవు పలికారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన హిందూ ముస్లిం జనఏక్తా వ్యవస్థాపక అధ్యక్షుడు స్వామి శ్రీలక్ష్మీశంకరాచార్య మాట్లాడుతూ కామ క్రోధ లోభాలకు అతీతంగా మనిషి ఉండాలన్నారు. అంతకుముందు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మెహమూద్ అలీ, హోంశాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి, లక్నోకు చెందిన హిందూ ముస్లిం జనైక్యత స్వామి శ్రీ లక్ష్మీశంకర ఆచార్యతో పాటు పలువురు నేతలు మాట్లాడారు. ఈ కార్యక్రమానికి పెద్దసంఖ్యలో అన్ని వర్గాలకు చెందిన ప్రజలు హాజరయ్యారు.