రాష్ట్రీయం

కార్పొరేట్ సంస్థల సహకారంతో మున్సిపల్ పాఠశాలల్లో వౌలిక వసతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, నవంబర్ 5: వచ్చే ఏడాది ప్రారంభంలోగా రాష్ట్రంలో అన్ని మున్సిపల్ పాఠశాలల్లో వౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకోసం కార్పొరేట్ సంస్థల సహకారం తీసుకుంటున్నట్లు రాష్ట్ర పురపాలక మంత్రి పి.నారాయణ పేర్కొన్నారు. శనివారం నెల్లూరులో మున్సిపల్ పాఠశాలల విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని 1500 మున్సిపల్ పాఠశాలల్లో రెండున్నర లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని, ఆయా పాఠశాలల్లో అవసరమైన సదుపాయాల కల్పనకు కార్పొరేట్ సంస్థల సహకారం కోరామన్నారు. నెల్లూరుకు కృష్ణపట్నం పోర్టు, తిరుపతికి టిటిడి, గుంటూరు, కృష్ణా జిల్లాలకు ఎల్ అండ్ టి, షాపూర్‌జీ, విశాఖకు పోర్టు విశాఖ నగర మున్సిపల్ పాఠశాలల్లో వౌలిక వసతుల కల్పనకు ముందుకు వచ్చినట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని 58 మున్సిపాలిటీల్లోని 147 పాఠశాలల్లో దాదాపు 21వేల మంది ఈ ఏడాది ఫౌండేషన్ కోర్సు అభ్యసిస్తున్నారన్నారు. త్వరలో మిగతా 52 మున్సిపాలిటీల్లోనూ ఈ కోర్సు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. దీని ద్వారా భవిష్యత్తులో మున్సిపల్ పాఠశాలల విద్యార్థులు అన్ని ప్రవేశ పరీక్షల్లో ప్రతిభ చూపడం, ర్యాంకులు సాధించడమే లక్ష్యంగా నిర్దేశించుకుని, ప్రణాళికాబద్ధంగా కోర్సును కొనసాగిస్తున్నామని తెలిపారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 150 చొప్పున ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల్లోనూ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఫౌండేషన్ కోర్సును ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు తాను ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నది, ప్రభుత్వ పాఠశాలలో చదివిన తాను కలెక్టర్ స్థాయికి రావడం వెనుక ఉన్న కృషిని ఆయన విద్యార్థులకు వివరించారు.