రాష్ట్రీయం

వైద్యుల నిర్లక్ష్యంతో ఆడ శిశువు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, నవంబర్ 5: వైద్యుల నిర్లక్ష్యం కారణంగా పండంటి ఆడ శిశువు మృతి చెందిన వైనం కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. జిల్లాలో సంచలనం సృష్టించిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పెడన 2వ వార్డు పడమట వీధికి చెందిన ఎండి బాజాని భార్య ఫాతీమున్నీసాకు శనివారం ఉదయం 11గంటల సమయంలో ప్రసవ నొప్పులు రావటంతో హుటాహుటిన అంబులెన్స్‌లో మచిలీపట్నం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. విధి నిర్వహణలో ఉన్న గైనకాలజిస్ట్ డాక్టర్ నీలిమ ఫాతీమున్నీసాను పరీక్షించగా ప్రసవానికి ఇంకా సమయం ఉందని, గర్భద్వారం మూసుకునే ఉందని, ఇవి కేవలం వాతం వల్ల వచ్చిన నొప్పులేనని చెప్పి ఆమెను ఇంటికి పంపించేశారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఫాతీమున్నీసాకు మళ్ళీ మధ్యాహ్నం 2గంటల సమయంలో విపరీతంగా నొప్పులు రావటంతో హుటాహుటిన ఆస్పత్రికి వచ్చారు. నొప్పులతో బాధ పడుతున్న ఫాతీమున్నీసానుకు విధి నిర్వహణలో ఉన్న ఇరువురు నర్సులు కాన్పు చేసినట్లు బాధితులు చెబుతున్నారు.