రాష్ట్రీయం

ఎన్‌కౌంటర్ హత్యలపై విచారణ జరిపించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 5: బూటకపు ఎన్‌కౌంటర్ హత్యలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచరణ జరిపించాలని విరసం నేత వరవరరావు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్‌కౌంటర్ పేరుతో 31మందిని తీవ్ర చిత్ర హింసలు పెట్టి కాల్చి చంపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బూటకపుఎన్‌కౌంటర్ హత్యలపై రౌండ్ టేబుల్ సమావేశం తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో శనివారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వరవరరావు మాట్లాడుతూ మావోయిస్టుల పేరుతో అమాయక ఆదివాసులను తీవ్ర చిత్ర హింసలుపెట్టి కాల్చి చంపడం దారుణమన్నారు. భోపాల్‌లో జ్యుడీషియల్ కస్టడిలో ఉన్న 8మందిని సిమీ కార్యకర్తలనే నెపంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం బహిరంగంగా కాల్చి చంపిందని ఆవేదన వ్యక్తం చేశారు. మావోయిస్టుల పేరుతో అమాయకులను చంపడం ఆపాలని అయన డిమాండ్ చేశారు. గ్యాంగ్‌స్టర్ నరుూం ముఠా నేర సామ్రాజ్యంలో భాగం పంచుకున్న రాజకీయ, పోలీసు అధికారులను తెలంగాణ ప్రభుత్వం చట్ట ప్రకారం అరెస్టు చేసి శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. దుర్మార్గాపు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడడానికి కార్యాచరణ రూపొందింస్తామని హెచ్చరించారు. అనంతరం జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ రాజ్యంగంలో ప్రతి ఒక్కరికీ జీవించే హక్కు ఉంటుందని నిరాయుధులైన వారిని చంపడం సరైంది కాదని పేర్కొన్నారు. అధికారంలో ఉన్న నాయకులే నరుూంను పెంచి పోషించారని విమర్శించారు. నరుూం కేసులో ఉన్న రాజకీయ, పోలీసు అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నేతలు జైని.మల్లయ్య, ప్రొ.పి ఎల్.విశే్వశ్వరరావు, ప్రొ.పద్మజా షా, ప్రొ.వైకె.రత్నం, చిక్కుడు ప్రభాకర్, కోట శ్రీనివాస్, బండి దుర్గాప్రసాద్, కంచర్ల బద్రి, రమామేల్కోటి పాల్గొన్నారు.