రాష్ట్రీయం

అడ్డుపడింది నెహ్రూనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 6: ‘నిజాంపై సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కుపాదం మోపకుండా అప్పటి ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ అడుగడుగునా అడ్డుపడ్డారు.’ అని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఆదివారం విమర్శించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి ఎస్ జైపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆదివారం కేంద్ర మంత్రి దత్తాత్రేయ ఆదివారం విలేఖరుల సమావేశంలో తీవ్రంగా ప్రతిస్పందించారు. జైపాల్‌రెడ్డిపై నిప్పులు చెరిగారు. ఎప్పుడూ హైదరాబాద్ విమోచన దినోత్సవంలో పాల్గొనని జైపాల్‌రెడ్డి కూడా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవంపై అవగాహనరాహిత్యంతో మాట్లాడారని ఆయన విమర్శించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ హోం మంత్రిగా సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని ఆయన అభినందించారు. కానీ అంతకంటే ముందు రెండు పర్యాయాలు నిజాంపై సైనిక చర్య తీసుకోకుండా జవహర్‌లాల్ నెహ్రూ అడ్డుపడ్డారని ఆయన విమర్శించారు. 1948 జూలైలో ఒకసారి, అదే సంవత్సరం ఆగస్టులో రెండోసారి సైనిక చర్యకు పటేల్ సిద్ధమైతే, నెహ్రు అడ్డుపడ్డారన్నారు. అయినా పటేల్ విజయవాడ, కర్నూలులో సైన్యాన్ని సిద్ధంగా పెట్టారని ఆయన తెలిపారు. సైనికచర్యకు పాల్పడరాదని నెహ్రు ఆదేశించగా, అప్పటికే సైనిక చర్య మొదలైందని, బాంబింగ్ జరిగిందని పటేల్ చెప్పారని ఆయన వివరించారు. హకీంపేట, ఔరంగాబాద్, వరంగల్ తదితర ప్రాంతాల్లో సైన్యం దిగి ఆపరేషన్ మొదలుపెట్టినట్లు ఆయన చెప్పారు.
హైదరాబాద్ విమోచనంలో పటేల్ పాత్ర అమోఘమైందని, అద్భుతమైందని దత్తాత్రేయ అన్నారు. కేవలం పత్రికావిలేఖరుల సమావేశాలకు, ప్రకటనలకే జైపాల్‌రెడ్డి పరిమితమవుతారని ఆయన దుయ్యబట్టారు. సైనికచర్యను నెహ్రూ, పటేల్ కలిసే నిర్ణయించారని జైపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదని అన్నారు. చరిత్ర గురించి తెలుసుకోవటానికి ఎంకెకె నాయర్ రాసిన పుస్తకాన్ని జైపాల్‌రెడ్డి చదువుకోవాలన్నారు. ఇంతగా మాట్లాడుతున్న జైపాల్‌రెడ్డి ఎప్పుడైనా పటేల్ జన్మదినోత్సవాన్ని నిర్వహించారా? అని ఆయన ప్రశ్నించారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గల్లీ లీడర్ అని జైపాల్‌రెడ్డి చేసిన విమర్శపై దత్తాత్రేయ ఘాటుగా స్పందించారు. అమిత్ షా గల్లీ నుంచి ఢిల్లీకి ఎదిగారని, జైపాల్ రెడ్డి ఢిల్లీ నుంచి గల్లీకి వచ్చారని ఆయన అన్నారు.