రాష్ట్రీయం

తెలంగాణ కాలేజీలపై ఎఎఫ్‌ఆర్‌సి పట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 7: వృత్తి సాంకేతిక విద్యా సంస్థల్లో ఇటు అధ్యాపకులు , అటు విద్యార్ధులు అక్రమార్కులే ఎక్కువగా ఉన్నట్టు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన విజిలెన్స్ తనిఖీల్లో తేటతెల్లం కావడంతో అక్రమార్కులకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం సిద్ధం అయ్యింది. చాలా కాలేజీల్లో పనిచేయని అధ్యాపకుల పేర్లు, రికార్డులు అధికారులకు చూపిస్తుండగా, వాటిని ఆమోదించి వెళ్లడం ప్రతిసారీ తనిఖీ బృందాలకు రివాజుగా మారింది. మరో పక్క తరగతులకు రాకున్నా, వేర్వేరు వ్యాపకాల్లో నిమగ్నమైన విద్యార్థులు హాస్టళ్లలో ఉంటూ, స్కాలర్‌షిప్‌లు తీసుకుంటూ ఉచిత విద్యను అందుకుంటూ మరో పక్క ఆయా విద్యాసంస్థలకే తలనొప్పిగా తయారవుతున్న వ్యవహారం కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ క్రమంలో ఇటు అధ్యాపకులను దారిలోకి తెచ్చేందుకు ఆయా విద్యాసంస్థలు నిర్వహించే వెబ్‌పోర్టల్స్‌లో అన్ని వివరాలూ పొందుపరచాలని ఆదేశించింది. అయితే వెబ్‌పోర్టల్స్‌లో ఉండే వారి పేర్లు వేరుగానూ, కాలేజీలో పనిచేస్తున్న వారి పేర్లు వేరుగానూ ఉన్నా వాటిని చెక్ చేసుకునే యంత్రాంగం ఉన్నత విద్యామండలిలో లేకపోవడంతో యాజమాన్యాలు ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగిపోతోంది. ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో అక్రమార్కులకు అడ్డుకట్టవేసేందుకు విద్యాసంవత్సరం ప్రారంభంలోనే ముందస్తుగా సమాచారాన్ని సేకరిస్తోంది. ఈమేరకు తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ కాలేజీలకు ఆదేశాలు జారీ చేసింది. దాని ప్రకారం ప్రతి కాలేజీలో పనిచేస్తున్న సిబ్బంది, బోధనేతర సిబ్బంది పేర్లు, వారి హోదా, అర్హతలు, పాన్ నెంబర్, ఆధార్ నెంబర్, ప్రతి నెలా చెల్లిస్తున్న జీతం వివరాలు కూడా కావాలని పేర్కొంది. అదే రీతిన ప్రతి కోర్సులో చేరిన విద్యార్థులు, వారి వివరాలు, రిజిస్ట్రేషన్ సంఖ్య, రోల్ నెంబర్‌లు కూడా పంపించాలని ఆదేశించింది. రానున్న రోజుల్లో కాలేజీల్లో బయోమెట్రిక్ డాటాను ఏర్పాటు చేసి , దానిని సెంట్రల్ కమాండ్‌తో అనుసంధానం చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. తద్వారా కాలేజీలు ఇచ్చే సమాచారంతో పనే్లకుండానే సెంట్రల్ కమాండ్‌లో ఏ లెక్చరర్ ఎన్ని గంటలకు వచ్చారో, ఏ కాలేజీ స్టూడెంట్ ఎన్ని గంటలకు కాలేజీకి వచ్చారో కూడా క్షణాల్లో తెలిసే వీలుంది. యాజమాన్యాల ఆటలకు దీంతో అడ్డుకట్టవేసినట్టవుతుందని ఉన్నత విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగానే టిఎఎఫ్‌ఆర్‌సి ఒక నోట్‌ను కాలేజీలకు పంపించింది. ఈ సమాచారాన్ని నవంబర్ 30లోగా పంపించాలని, ఎప్పటికపుడు మార్పులు, చేర్పులు కూడా టిఎఎఫ్‌ఆర్‌సికి చేరవేయాలని కూడా సూచించింది. ఈ ప్రయత్నాలు ఫలిస్తే నకిలీలకు తెరదించినట్టవుతుందని చెబుతున్నారు.