రాష్ట్రీయం

రిటైర్డ్ ఏఎస్పీని ప్రశ్నించిన సిట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 7: గ్యాంగ్‌స్టర్ నరుూం అక్రమ వ్యవహారాల కేసులో రిటైర్డ్ అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డి, నరుూం డ్రైవర్ శామ్యూల్ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సోమవారం ప్రశ్నించింది. నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో ఈ విచారణ కొనసాగింది. నరుూం ఎన్‌కౌంటర్‌లో మృతి చెంది మూడు నెలలు గడిచింది. చార్జిషీట్ దాఖలు చేయనున్న నేపథ్యంలో ఈ విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికి సిట్ అధికారులు పలువురు రాజకీయ నాయకులను, పోలీసులను ప్రశ్నించిన విషయం తెలిసిందే. కాగా అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డి 1995-97 వరకు నల్గొండ జిల్లా చౌటుప్పల్ సిఐగా, 1997-2000 వరకు భువనగిరి డిఎస్పీగా, 2003-2004 వరకూ నల్గొండ డిఎస్పీగా పనిచేశారు. దాదాపు రెండున్నర గంటల సేపు ప్రశ్నించిన సిట్ అధికారులు అతని నుంచి పలు విషయాలు రాబట్టినట్టు తెలుస్తోంది.
సోమవారం సిట్ అధికారుల విచారణ అనంతరం రిటైర్డ్ అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాన భువనగిరి డిఎస్పీగా పనిచేస్తున్న సమయంలో నరుూం అక్కడే జైల్లో ఉన్నాడని, వృత్తిపరంగా రెండుసార్లు అతడిని కలిసినట్టు తెలిపారు. తాను భువనగిరిలో ఉన్నంత కాలం నరుూం గ్యాంగ్ అంటూ ఎవరూ లేరన్నారు. నరుూంతో ఎలాంటి భూ సెటిల్‌మెంట్లు చేయలేదని, సెటిల్‌మెంట్లు చేయాల్సిన అవసరం తనకు ఏ మాత్రం లేదని రవీందర్‌రెడ్డి స్పష్టం చేశారు. తనకు హైదరాబాద్‌లో అంగుళం భూమి కూడా లేదని, నిజామాబాద్‌లో భూములు ఉన్నట్టు తెలిపారు. నరుూం గురించి తనకు తెలిసిన సమాచారాన్ని సిట్ అధికారులకు తెలిపానని, ఇతర పోలీస్ అధికారులు, నేతల గురించి తననేమీ అడగలేదని అదనపు ఎఎస్పీ రవీందర్‌రెడ్డి చెప్పారు.