రాష్ట్రీయం

మీడియాపై ఆంక్షలు సరికాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ ఖైరతాబాద్, నవంబర్ 7: వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకువచ్చినందుకు మీడియాపై ఆంక్షలు విధించడం సమంజసం కాదని పాత్రికేయులు ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ మీడియా సంస్థ ఎన్‌డిటివి, న్యూస్ అసోంపై కేంద్రం ఆంక్షలు విధించడాన్ని నిరసిస్తూ ర్యాలీ నిర్వహించారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీకి సీనియర్ పాత్రికేయులు అమర్‌నాథ్, దేవులపల్లి అమర్ పాల్గొన్నారు.
పఠాన్‌కోట్ దాడిలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపడం సదరు సంస్థలు చేసిన నేరమా అని ప్రశ్నించారు. గతంలో కూడా ప్రజా సమస్యలు, ప్రభుత్వ నిర్లక్ష్యాలను వెలుగులోకి తెచ్చిన జర్నలిస్టులు, సంస్థలపై కేసులు నమోదు చేశారని అన్నారు. జర్నలిస్టులంతా ఐక్యంగా ఉన్నప్పుడే ఇలాంటివి పునఃరావృతం కావని అన్నారు.
అనంతరం మీడియా స్వేచ్ఛను రక్షించాలని నినాదాలు చేస్తూ ప్రెస్‌క్లబ్ నుంచి ప్రధాన రహదారి వరకు ర్యాలీ నిర్వహించారు.

చిత్రం.. మీడియాపై కేంద్రం ఆంక్షలను నిరసిస్తూ సోమవారం
హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ నుంచి ర్యాలీ నిర్వహించిన పాత్రికేయులు