రాష్ట్రీయం

అగ్రిగోల్టు ఆస్తులు అమ్మే బాధ్యత తీసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 7: అగ్రిగోల్డు బాధితులను ఆదుకునేందుకు ఆ సంస్థకు ఉన్న ఆస్తులను అమ్మే బాధ్యతను ఎపి ప్రభుత్వం తీసుకోవాలని రాష్ట్ర హైకోర్టు సోమవారం నాడు ఆదేశించింది. విజయవాడ పరిసరాల్లోని ఏడు ఆస్తులను అమ్మాలని సూచించింది. జస్టిస్ వి రామసుబ్రమణియన్, జస్టిస్ ఎస్ వి భట్‌లతో కూడిన డివిజన్ బెంచ్ అగ్రి గోల్డు డిపాజిటర్సు ఏజెంట్స్ సంక్షేమ సంఘం దాఖలు చేసిన పిల్‌ను విచారించింది. ఏడు రాష్ట్రాల్లోని 32 లక్షల మంది డిపాజిటర్లకు చెల్లింపులు జరగాల్సి ఉందని ఆ పిల్‌లో పేర్కొన్నారు. సిఐడి అదనపు డిజి ఆస్తుల అమ్మకానికి సమన్వయం చేయాలని, మార్కెట్ ధరను నిర్ధారించి కనీసం 10 శాతం అప్‌సెట్ ధరను నిర్ధారించుకోవాలని సూచించింది. 21వ తేదీ నాటికి ఇందుకు సంబంధించి నిర్ధారణలకు వస్తే నవంబర్ 28న ఆంగ్ల, తెలుగు దినపత్రికల్లో ప్రకటనలు జారీ చేయాని డిసెంబర్ 16లోగా దరఖాస్తు దారుల వివరాలు సీల్డు కవర్లో న్యాయస్థానం ముందుంచాలని, బిడ్లను డిసెంబర్ 19న తెరవాలని పేర్కొంది. ఎపి ప్రభుత్వ ప్రత్యేక కౌన్సిల్ కృష్ణ ప్రకాష్ మాట్లాడుతూ గుంటూరులోని హాయ్‌ల్యాండ్‌ను అమ్మడం చాలా తేలికైన పని అని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనపై అగ్రిగోల్డు ప్రతినిధి ఎల్ రవిచందర్ అభ్యంతరం తెలిపారు.