రాష్ట్రీయం

ఐటిడిఏకు షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, నవంబర్ 7: భద్రాచలానికి షాక్ మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. విభజన, జిల్లాల పునర్విభజనలో ఏకంగా రూపు మారిపోయిన భద్రాచలం నియోజకవర్గం ఐటిడిఏ కేంద్రం తర్వాత పలు ప్రభుత్వ కార్యాలయాలను కోల్పోయింది. ఇప్పటికే పలు కార్యాలయాలు ఇక్కడి నుంచి తరలిపోయాయి. ఐటిడిఏలోని జిల్లా మలేరియా, నీటిపారుదల శాఖ కార్యాలయాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి తరలాయి. తాజాగా ఐటిడిఏలోని సమాచార, ప్రచార శాఖ ఏపిఓ (పబ్లిసిటీ) పోస్టును రద్దుచేసింది. ఐటిడిఏ ఆవిర్భవించిన నాటి నుంచి ఈ పోస్టు ఉంది. పాల్వంచలో ఐటిడిఏ కార్యాలయం ఉన్న సమయంలోనే ఈ పోస్టు మంజూరైంది. జిల్లాల పునర్విభజన చేపట్టాక ఖమ్మం జిల్లాలో కొత్తగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆవిర్భవించింది. దీంతో భద్రాచలం ఐటిడిఏలోని పలు కార్యాయాలను అక్కడికి తరలించారు.