రాష్ట్రీయం

ఉచిత వైద్యశిబిరంలో నకిలీ డాక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటాపురం, నవంబర్ 8: ఇటీవలే కొత్తగా ఏర్పడిన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని వెంకటాపురంలో మంగళవారం బన్ను ఆసుపత్రి ఏటూరునాగారం ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్యశిబిరానికి పెద్దఎత్తున ప్రచారం చేయడంతో వందల సంఖ్యలో రోగులు తరలివచ్చారు. కాగా ఈ ఉచిత మెగా వైద్యశిబిరంలో నలుగురు ప్రత్యేక వైద్య నిపుణులు రోగులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తారని ప్రకటించారు. డాక్టర్ డిసిఎస్ చౌదరి (ఎండీ జనరల్) అనే నకిలీ వైద్యుడు గతంలో వివిధ రకాల పేర్లతో ఆసుపత్రులు నిర్వహిస్తూ విశాఖ కింగ్‌జార్జి వైద్యశాలలో నకిలీ విద్యార్హత పత్రాలతో ఉద్యోగం చేశాడు. ఏపీలోని తణుకులో ఈ వైద్యుడిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు.
జైలు నుంచి విడుదలైన తర్వాత దుమ్ముగూడెం మండలం లక్ష్మీనగరంలో మల్టీ స్పెషాలిటీ పేరుతో ఆసుపత్రి తెరిచి ప్రతి మంగళవారం వెంకటాపురం మండల కేంద్రంలోని ఒక ప్రైవేట్ వైద్యశాలలో రోగులను పరీక్షిస్తూ రెండు, మూడువారాల పాటు ఈ వైద్యుడు ఆకర్షించాడు. ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్లు ఈ వైద్యుడి విద్యార్హతలపై విచారణ నిర్వహించడంతో పరారయ్యాడు. ఈ తతంగమంతా ఆగస్టు నెలలో జరగ్గా మంగళవారం ఉచిత వైద్యశిబిరంలో ఈ నకిలీ ఎండీ ప్రత్యక్షమై రోగులను పరీక్షిస్తున్నట్లు, మందులు రాస్తున్నట్లు ఎస్పీహెచ్‌వో డాక్టర్ నరేష్‌కుమార్‌కు సమాచారం అందింది. ఈ మేరకు పోలీసులకు సమాచారమిచ్చి అతిథిగృహం మెయిన్‌గేట్లను మూసివేశారు. ఒకపక్క ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్లు, మరోపక్క పోలీసుల హడావుడి వైద్యశిబిరానికి వచ్చిన రోగులకు ఏం జరుగుతుందో తెలియక హైరానా పడ్డారు. పోలీసులు వచ్చారని తెలుసుకున్న నకిలీ వైద్యుడు కారు ఎక్కి పరారయ్యేందుకు సిద్ధం కాగా పోలీసులను చూసి అతిథిగృహం వైపు పరుగులు తీశాడు. ఈ తతంగం అంతా సినీ ఫక్కీలో జరగ్గా నకిలీ వైద్యుడి వెనుక మీడియా, పోలీసులు, మెడికల్ ఆఫీసర్లు వెంటపడగా గోడ దూకే యత్నం విరమించుకొని అతిథిగృహంలో దాక్కుని తలుపులు వేసుకున్నాడు. పోలీసులు తలుపులు తీసి అతన్ని అరెస్టు చేశారు. విషయం తెలుసుకున్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య జిల్లా కలెక్టర్ మురళి ఆదేశంపై హుటాహుటిన వెంకటాపురం చేరుకొని వైద్యశిబిరంలో పాల్గొన్న వైద్యుల విద్యార్హతలపై ఆరా తీశారు.
పిల్లల వైద్య నిపుణుడి విద్యార్హతలపై ఇంటర్నెట్‌లో పరిశీలించగా వేరే పేరుతో దర్శనమివ్వడంతో వైద్యశిబిరాన్ని నిలిపివేయాలని ఆదేశించారు. ప్రభుత్వ వైద్యులతో డీఎంహెచ్‌వో పర్యవేక్షణలో వచ్చిన రోగులకు పరీక్షలు చేసి మందులు అందించారు. ఈ మేరకు నకిలీ వైద్యుడిపై ఆంధ్ర, తెలంగాణలో మూడు కేసులకు పైగా నమోదైనట్లు విచారణలో వెల్లడైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కుమార్ విలేఖర్లకు చెప్పారు.

చిత్రం.. డిసిఎస్ చౌదరి