ఆంధ్రప్రదేశ్‌

నిస్సహాయులను కాల్చి చంపారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 8: ఆంధ్రా ఒడిశా సరిహద్దు (ఎఓబి) బెజ్జంగిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నిస్సహాయ స్థితిలో ఉన్న మావోయిస్టులను పోలీసులు కాల్చి చంపారని కోఆర్డినేషన్ ఆఫ్ డెమెక్రాటిక్ రైట్స్ ఆర్గనైజేషన్ (సిడిఆర్‌ఓ) నిజనిర్ధారణ కమిటీ తేల్చింది. దేశ వ్యాప్తంగా 20 రాష్ట్రాలకు చెందిన ప్రజా సంఘాల కూటమి ప్రతినిధులు మూడు రోజుల పాటు ఎన్‌కౌంటర్ జరిగిన అటవీ ప్రాంతంలో పర్యటించి వాస్తవాలను సేకరించారు. అనంతరం విశాఖలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ వందల సంఖ్యలో పోలీసు బలగాలు, మావోయిస్టుల ఏరివేతలో మానహక్కులను కాలరాశారని ఆరోపించారు.
ఇన్‌ఫార్మర్‌ల సాయంతో మావోయిస్టులు సమావేశమైన ప్రాంతంపై వందల మంది సాయుధ పోలీసులు దాడికి తెగబడ్డారని ఆరోపించారు. తొలి రోజు మాత్రమే పోలీసులు - మావోయిస్టులకు నడుమ కాల్పులు జరిగాయని, మరో రెండు రోజుల పాటు అదులోకి తీసుకున్న అమాయకులను పోలీసులు అత్యంత క్రూరంగా హింసించి మరీ మట్టుబెట్టారని ఆరోపించారు. మృతి చెందిన వారి శరీరాలపై ఉన్న గాయలను చూస్తే పోలీసులు ఎంత క్రూరంగా ప్రవర్తించారో అర్ధం అవుతోందన్నారు. ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన 31 మందిలో 10 మంది గిరిజనులు ఉన్నారని, వారిని కూడా పోలీసులు మావోయిస్టులుగా భావించి కాల్చివేయడం హేయమైన చర్యగా పేర్కొన్నారు.
నక్సల్స్ అనేది సామాజిక సమస్యని, సమస్య పరిష్కారం పక్కనపెట్టి ఎన్‌కౌంటర్ల పేరిట వారిని మట్టుబెట్టే ఆలోచన సరైనది కాదన్నారు. జరిగిన ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని, ఎన్‌కౌంటర్‌కు పాల్పడ్ట పోలీసులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, గ్రేహౌండ్స్‌ను రద్దు చేయాలని, పారామిలటరీ బలగాలను వెనక్కు పిలిపించాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీలో అటవీ హక్కులు, పంచాయతీరాజ్, షెడ్యూల్ ఏరియా చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మరణించిన మావోయిస్టుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సిడిఆర్‌ఓ ప్రతినిధులు ప్రొఫెసర్ శేషయ్య, గోపాల్, కాత్యాయనాయ విద్మహే తదితరులు పాల్గొన్నారు.