రాష్ట్రీయం

నోట్లు రద్దుపై ఎవరేమన్నారంటే...?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐదు వందలు, వెయ్యి రూపాయల కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ
తీసుకున్న నిర్ణయంపై వివిధ రాజకీయ పార్టీలు స్పందించాయి.

నల్లధనంపై ఉక్కు పాదం
ప్రధానమంత్రి ఐదువందల రూపాయల నోట్లను, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైనదని, నల్లధనంపై ఉక్కు పాదం మోపారని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అభినందించారు. అందరి అవసరాలను తీర్చాల్సిన సంపదను కొందరు దిగ్బంధం చేసి నల్లధనం రూపంలో దాచుకుంటున్నారని అన్నారు. దేశంలో నల్లధనం దేశ ఆర్థిక వ్యవస్థను శాసించే స్థాయికి ఎదిగిందని, కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఇతర దేశాల్లో నకిలీ కరెన్సీని ముద్రించి దేశంలోకి పంపిస్తూ, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే కుట్ర జరుగుతోందని ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయం సమంజసమైనదని అన్నారు.
- ఈటల రాజేందర్
ఆర్థిక మంత్రి, తెలంగాణ
అకౌంట్లు లేని వారి సంగతి?
ఇదేం సంచలనమో అర్థం కావడం లేదు. ప్రధాని తీసుకున్న నిర్ణయం ప్రజల్లో అనవసరమైన భయాందోళనలు సృష్టించడమే. బ్యాంకుల్లో, పోస్ట్ఫాసుల్లో 500, వెయ్యి రూపాయల నోట్లను మార్చుకోవచ్చని మోదీ సెలవిచ్చారు. బాగానే ఉంది, కానీ బ్యాంకుల్లో, పోస్ట్ఫాసుల్లో అకౌంట్లు లేని వారి సంగతేమిటి? ఇటువంటి కీలకమైన అంశాలపై చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. అభివృద్ధి చెందిన దేశాలేవీ ఇలా నోట్లను రద్దు చేయడం, మార్చడం గురించి వినలేదు, చూడలేదు. ప్రధాని మోదీ స్విట్జర్లాండ్ నుంచి నల్లధనం తెచ్చి పంచుతానని ప్రకటించి పేదల గుండెలు గుభేలుమనేలా ఈ వార్తను ప్రకటించారు. గోనె సంచుల్లో నల్లధనం కట్టుకున్న వారి సంగతేమో కానీ, చిన్న, చితక వ్యాపారాలు చేసుకుంటూ బ్యాంకులు, పోస్ట్ఫాసుల్లో అకౌంట్లు లేని వారి కొంప ముంచారు.
- డాక్టర్ శ్రవణ్ దాసోజు,
ముఖ్య అధికార ప్రతినిధి, టి.పిసిసి
చంద్రబాబుదే ఆ ఘనత
ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న సంచలనాత్మకమైన నిర్ణయం వెనుక మూల కారణం మా పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఈ మధ్య కాలంలో చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి ప్రధానిని కలిసి 500, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేయాల్సిందిగా కోరారు. ఇప్పుడే కాదు... చాలాకాలంగా చంద్రబాబు చెబుతున్నారు. ప్రధాని తీసుకున్న ఈ చారిత్రాత్మకమైన నిర్ణయంతో నల్లధనం బయటకు వచ్చి, దేశాభివృద్ధికి దోహదపడుతుంది.
-ఎం అమర్‌నాథ్ బాబు,
ప్రధాన కార్యదర్శి, టి.టిడిపి
నల్లధనం సంగతేమిటి?
రాబోయే రోజుల్లో రెండు వేల రూపాయల నోట్లనూ మనుగడలోకి తీసుకుని వస్తామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. కానీ పండ్లు, కూరగాయలు అమ్ముకునే వారికి ఎవరైనా 2 వేల రూపాయల నోటు ఇస్తే చిల్లర ఎలా లభిస్తుంది? ఎందుకు ఇటువంటి ప్రయోగాలు చేస్తున్నారు? స్విట్జర్లాండ్ నుంచి నల్లధనం తీసుకుని వచ్చి పేదల అకౌంట్లలో 15 లక్షల రూపాయలు వేస్తామని ఇచ్చిన హామీ ఏమైంది?

- హెచ్‌ఎ రెహమాన్,
జాతీయ ప్రధాన కార్యదర్శి, వైకాపా